ఓమారు ప్రపంచ స్థాయిలో పిల్లులకోసం ఓ పోటీ పెట్టారు. అన్ని దేశాల పిల్లులనూ ఓడించి అమెరికా పిల్లి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. పాకిస్తాన్ పిల్లి, జర్మనీ పిల్లి, ఆస్ట్రేలియా పిల్లి ఇలా అన్ని దేశాల పిల్లులూ అమెరికా పిల్లి దగ్గర దెబ్బలు తిని తలవంచాయి.
అమెరికా పిల్లి కదా, పాలు తాగుతూ, మాంసం తింటూ బాగా బొద్దుగా ముద్దుగా పెరిగింది.
ఇక ఆఖరి రౌండ్ పోటీ మిగిలి ఉంది.
ఈ తుది పోరులో అమెరికా పిల్లితో సోమాలియా పిల్లి తలపడనున్నట్లు ప్రకటించారు.
ప్రేక్షకులకు ఆశ్చర్యం.
సోమాలియా పిల్లి పరిస్థితి రోగిష్టిలా బక్క చిక్కి నడవలేని స్థితి. ఎలాగో వేదికపైకెక్కింది. అలాంటి డొక్కు పిల్లి అమెరికా పిల్లిని ఎలా గెలుస్తుంది?
ప్రేక్షకులు గోల గోల చేశారు. ఈలలు వేశారు. అవహేళన చేస్తూ నవ్వారు.
పోటీ ప్రారంభమైంది.
అమెరికా పిల్లి అతి చులకనగా సోమాలియా పిల్లి చెంతకు వెళ్ళింది. అయితే సోమాలియా పిల్లి ముందర కాళ్ళతో ఒక్క దూకు దూకి అమెరికా పిల్లి నెత్తి మీద ఓ దెబ్బ వేసింది.
ఊహించని రీతిలో అమెరికా కళ్ళు బైర్లు కమ్మాయి. కింద పడిపోయింది.
ప్రేక్షకులు విస్తుపోయి చూస్తున్నారు.
కాస్సేపటికి స్పృహలోకొచ్చి కళ్ళు తెరచి చూసిన అమెరికా పిల్లికి ఏమీ అర్థం కాలేదు.
సోమాలియా పిల్లి మెడలో బంగారు పతకం వేలాడుతోంది.
పోటీలో గెల్చిన సోమాలియా పిల్లితో అందరూ కరచాలనం చేస్తున్నారు. ప్రశంసిస్తున్నారు.
అమెరికా పిల్లి సోమాలియా పిల్లి దగ్గరకు వెళ్ళి ఎన్నో దేశాల పిల్లులను ఓడించిన ఈ బలవంతుడైన నన్నెలానువ్వు గెలిచావు? ఏమీ అర్థం కావడం లేదు ? అంది మెల్లగా.
అప్పుడది అమెరికా పిల్లితో చెప్పింది...
"నేను పిల్లిననుకున్నావా....పు...పు...పులినిరా...మా దేశంలో నెలకొన్న తీవ్ర అనావృష్టితో నేనిలా మారిపోయాను. మాంసం తింటూ పాలు తాగినా పిల్లి పిల్లే..... పస్తులతో ఉన్నాసరే పులి పులేసుమీ! అర్థం చేసుకో.... కనిపించడానికి పిల్లిలా ఉండొచ్చు. కానీ నేను పులిని" అంది సోమాలియా పులి.
కనుక పరిస్థితులెలా ఉన్నా మనసుని చెదరిపోనివ్వకూడదు.
పిల్లికీ ఓ రోజంటూ ఉంటే పులికీ ఓ రోజొస్తుంది...
అప్పుడు చూపిస్తాం ఈ ప్రపంచానికి మేమెవరమని అంది సోమాలియా పులి!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి