భావి తరాలకు బాటలం;-పి.విశాలాక్షి--సికింద్రాబాద్
బాల బాలికలం 
ఆటపాటల్లో ఉద్ధండులం 
 బడిలో విద్యార్థులం
అమ్మకు ముద్దులొలికే పాపలం
నానమ్మకు అల్లరి పిడుగులం

తాతయ్యకు తోడునీడలం
కలతలు ఎరుగని స్నేహితులం
హెచ్చు తగ్గులు ఎంచని పిల్లలం
కులమత భేదాలు చూడని భావిభారత పౌరులం..
ప్రకృతి ప్రేమికులం

సాధు జీవులకు రక్షకులం
కష్టంలో వున్నవారికి సహాయకులం



కామెంట్‌లు