కలకాలం నిలుస్తుంది @(చిత్ర కవిత )-- కోరాడ నరసింహా రావు !
నైపుణ్యమునుచూపగలిగితే.... 
   చేతి వృత్తి అదేదైన నేమి !
కుమ్మరి,కమ్మరి,వడ్రంగియె
     కాదు..... ! మేదరి కూడా కళాకారుడే.... !! 
    పనిలో శ్రద్ద...నైపుణి చూపగ ఆసక్తి..., ఉంటే చాలు... !
  పదుగురినీ మెప్పించవచ్చును
ప్రశంస లెన్నో పొందవచ్చును !!

   వెదురుకఱ్ఱను తెచ్చి... 
.సన్ననిబద్దలు,పుల్లలుగమార్చి 
 చక్కని ఆకృతులలో అల్లి... 
  బుట్టలు చేసే నేర్పరి తనము 
కులవృత్తిగతాత,తండ్రులనుండి ప్రాప్టించిన వెలకట్టలేని... 
  వారసత్వ సంపద యిది... !
 మన ప్రోత్సాహమే లభిస్తే... 
   కలకాలం నిలుస్తుంది !!
       *******

కామెంట్‌లు