ఆరువేల గణిత అవధానాలు చేసిన ఒకే ఒక్కడు! సంగీతవిద్వాంసుడు1997 డిసెంబర్ 2న శ్రీకాళహస్తిస్వామి సన్నిధిలో వైలెన్ వాయిస్తూ రాలిన అద్భుత కుసమం శ్రీ లక్కోజు సంజీవరాయశర్మగారు.కడపజిల్లా కల్లూరులో27నవంబర్ 1907లోజన్మించిన పుట్టుకతోనే అంధుడైన ఆమహామనీషి జీవితచరిత్ర నిన్న చదివాను. నాగమాంబ పెద్ద పుల్లయ్య అమ్మా నాన్న లు. బ్రెయిలీ లిపి అందుబాటులో లేదు. అక్క బడిపాఠాలు పెద్దగా చదువుతుంటే చిన్నారి శర్మ వినేవాడు.తండ్రి బాల్యంలోనే చనిపోటం బీదరికం!రైతులకు ధాన్యం ధరలు లాభనష్టాలు భూమి కొలతలు టకటకా నోటి తో లెక్కవేసి సందేహాలు తీర్చేవారు.వైలెన్ నేర్చుకుంటూ తొలిసారి 1928లోగణిత అవధానం చేశారు. కర్నాటక మహారాష్ట్ర బీహార్ ఢిల్లీ..దాదాపు భారత యాత్రచేసి గణిత అవధానాలు చేసిన మేధావి. పుట్టిన తేదీ వారం తెలిపితే జాతకం చెప్పి ప్రశంసలు అందారు.1966డిసెంబర్ 7న హైదరాబాద్ శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయంలో 2పవర్ 103కి 32సంఖ్యలు ఠక్కున చెప్పారు. అంకె సంఖ్య ఎలా ఉంటుందో తెలీదు.డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన ప్రతిభవిని తన దగ్గర ఉన్న సొంత డబ్బుని శర్మ గారికి ఎం.ఓ.చేశారు. కాశీనాధుని నాగేశ్వరరావుగారు శకుంతల దేవి ప్రశంసించారు. 1993 లోఅమెరికా తెలుగు సంఘాలు ఆహ్వానించాయి.వీసారాక ఆగిపోయారుట! ఆయన 14బంగారు పతకాలని రైలు ప్రయాణంలో ఎవరో దొంగిలించారు.అంకవిద్యాసాగర విశ్వ సాంఖ్యాచార బిరుదులు. ఆయన జీవితంగూర్చి వివరణలేదు.ఇలాంటి మేధావిని తెలుగుతేజంని దివ్యాంగుడిని గూర్చి పాఠంగా పుస్తకాలలో రావాలి.🌷
మరుగున పడిన మహనీయుడు! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి