ఏకాంతంలో చర్చలు
ఒంటరిగా వాదనలు
మెత్తగ తాకే తలపుల
కెరటాలు....
నురగలా మిగిలే
గుండె బరువు
మరలి రాని మజిలీ
చేరిన మమతల జ్ఞాపకాలు
మరపురాని అభిమానాల
మల్లెల పరిమళాలు
శూన్యంలో వెదికే బేలచూపులు
ఎంత పిలిచినా వినపడని పిలుపులు
గతంగా మారిన వర్తమానాలు
భవిష్యత్తేలేని అనుభవాలు
శిలల శిథిలాలలా
మిగిలిన క్షణాలు....
కనుమూసినా కనిపించని
కరిగిన కల్లలైన కలలు
అరచేతుల్లో ఆశలదీపాలు
కడలిలో కలిసిన కన్నీళ్ళు
కాలపు మాయాజాలం
ఏ దిశను నడిపేనో!?
ఏ దరికి చేర్చేనో!?
ఉదయంతో హృదయం
వెలిగించి ఊపిరిపోసే తూరుపుకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి