సుప్రభాత కవిత; -బృంద
తూర్పూ పడమరల మధ్య
దినకరుడి  భ్రమణం

తొలి వెలుగు కిరణం
చేయును తమోపహరణం

బంగారు రజనులా జాలువారు
మయూఖ ప్రయాణం.

కనరాని చైతన్యం నిండి
పులకరించు కణకణం

యుగాలుగా జరుగుతున్నా
సరి క్రొత్తగా ప్రతి ఆవిష్కరణం

సృష్టి  మొత్తం స్పందించి
జోతలర్పించు ప్రతి కోణం

ఇనుడి కరుణకు ఇల చేసే
పరిభ్రమణం

కొత్తగా కలిగె  అనుభవాలకు
కొన్ని  మార్పుల  కారణం

వెలుగు నీడల అల్లికలే
జీవితంలో అనుక్షణం

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు