సుప్రభాత కవిత ; -బృంద
‍వంద సంవత్సరాల
పండుగ....

‍చిరంజీవులకు ప్రతిరోజూ
పుట్టిన రోజే!

తెలుగు పాటకు
పుట్టిన రోజు...

పరిచయం అక్కర్లేని
పేరు....

వారి గళమే 
వారిచిరునామా 

అన్నమయ్య పాట
తెలియని వారుంటారేమో!

ఘంటసాల గారి పాట
తెలియని తెలుగువారుండరు.

తిరుమల వేంకటేశుడు
ఇలవేలుపయితే
ఘంటసాల  వెంకటేశుడు
గళవేలుపు.

నీలిమేఘాలలో
గాలికెరటాలలో
వారిపాట సదా
వినిపిస్తుంటుంది

సప్తాశ్వర సమారూఢం
అంటూ   వేకువనే
గుర్తొస్తారు..

భలే భలే అందాలు
అని వినిపిస్తుంది
ప్రకృతి ని చూస్తుంటే!

ఆడుతు పాడుతూ
అలుపులేకుండా
పని చేసుకుంటాం.

పెళ్లి చేసుకుని
ఇల్లు చూసుకుని
చల్లగా ఉన్నాం.

ఆనందమే జీవిత
మకరందం ..
అని తెలుసుకున్నాం.

కల కానిదీ విలువైనదీ
బ్రతుకు  అని
జాగర్తగా  ఉన్నాం.

ఎవరో వస్తారని
ఏదో చేస్తారని
అస్సలు ఎదురు చూడం.

మనిషైతే మనసుంటే
అన్నారని
కరుణ కలిగి ఉన్నాం.

నీతికి నిలబడి 
నిజాయితీగా ఉండి
ఎవరికీ తలవంచం.

పసిపాప మనల్ని
చూసి చేజాపితే
వచ్చే ఆనందం.....

మీ పాట వింటే
మాకు కలుగుతుంది.

మీరు మా  మనసులో
ఎప్పటికీ చిరంజీవులే!
మేమున్నా లేకున్నా
మీరు..మీ పాట
తెలుగునాట
అజరామరం....

మీ సేవకే  ఈ మా
🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు