"శనివారం వస్తే చాలు ఇంట్లో కాలు నిలవదు కదా! మీతో పాటు వాడినీ చెడగొట్టేస్తున్నారు" అన్నది చెప్పులేసుకుని బయటికెళ్ళటానికి ఉద్యుక్తుడవుతున్న భర్త శ్యాం తో అరుణ.
"నీకెందుకంత కుళ్ళు..కావాలంటే నువ్వూ రా. నేనొద్దన్నానా" అన్నాడు నవ్వుతూ వెనక్కి తిరిగి.
"ఆ:( అందరూ రోగాలు తెచ్చుకు పడకేస్తే ఇక్కడ చేసేదెవరు? చాకిరీకి నేను..అనుభవానికి మీరు" అంది మూతి తిప్పుతూ!
@@@@
"ఏమిటి పేపర్లోకి మొహం అంతలా దూర్చేసి చదివేస్తున్నారు? అంత ఆకర్షణీయమైన వార్తా" అన్నది భర్త పక్కన కూర్చున్న అరుణ.
"ఏమిటేమిటి..చూడు..పిజ్జా కొంటే కోక్ ఫ్రీ ట. అదే మనం విడిగా బాటిల్ కొనాలంటే 300/- రూపాయలు. ఒక దెబ్బకి రెండు పిట్టలు. ఒక ప్లేట్ భేల్ పూరి కొంటే ఒక పాని పూరి ఫ్రీ. నాలుగు సమోసాలు కొంటే సగం ప్లేట్ చాట్ ఫ్రీ! నాలుగు మిరపకాయ బజ్జీలకి చిన్న కప్ ఐస్ క్రీం ఫ్రీ. ఎవడిస్తాడోయ్ ధరలు మండిపోయే ఈ రోజుల్లో ఇంత గొప్ప ఆఫర్?" అన్నాడు శ్యాం కళ్ళు మెరుస్తుండగా.
"ఆ:( ఎందుకివ్వడూ? ఈ మధ్య కోవిడ్ పేరు చెప్పి జనాలు బయటికెళ్ళి తినాలంటే హడిలి చస్తున్నారు. ఆ రకంగా వాడికి గత రెండేళ్ళుగా వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి ఇలా మీ బోటి తిండి ప్రియులని ఆకర్షించటానికి వాడి పన్నాగాలు ఇవి! ఫ్రీ అంటే ఎగబడే జనాలే వాడి లక్ష్యం మరీ!"
"మీకు 'ఫుడ్ ఐటంస్ ఫ్రీ' అనే ప్రకటన పక్కనే మా దగ్గరే అన్ని మందులు కొంటే 20%... రాయితీ..మాస్టర్ హెల్త్ చెకప్ లో అన్ని టెస్టులు సగం ధరకే' అనే మందుల షాప్ వాడి ప్రకటన కనిపించలేదు కదా! ఎందుకంటే వాడికి తెలుసు..ఈ కాలపు వాళ్ళ అలవాట్లు..వాటితో వచ్చే ఆరోగ్య అవసరాలు..
'చాట్ తింటే అసిడిటీ ఫ్రీ'...
'కోక్ తాగితే డయాబెటిస్ ఫ్రీ',
'మిరపకాయ బజ్జి తింటే అల్సర్.. బిపి ఫ్రీ' కదా..
"ఆ మాట వాడు చెప్పడు..డయాగ్నాస్టిక్ సెంటర్ల వాళ్ళు చెబుతారు."
"పాపం ఒకడి బిజినెస్ కి ఇంకొకడు సపోర్ట్ అన్నమాట. అందరూ బతకాలి కదా!"
"అది సంగతి" అన్నది అరుణ...జ్ఞాన బోధ చేస్తున్న గౌతమ బుద్ధుడి లాగా!
"అబ్బో నా తిండి మీదే ఎప్పుడూ నీ కళ్ళు! రెండు చీరలు కొంటే ఒకటి ఫ్రీ అని బాంబే డైయింగ్ వాడి ప్రకటన చూడగానే పరుగెత్తేదెవరో" అన్నాడు ఉక్రోషంగా!
"చీర ఫ్రీగా ఇస్తే పోతే ఒక్క చీరే పోతుంది. ఆరోగ్యం కాదు! అయినా వాడు ఎక్కడో పోగు పోయిందనో..ప్రింట్ సరిగా కలవలేదనో ఫ్రీ గా ఇస్తాడు కానీ..ఆరోగ్యాలు చెడగొట్టే మాస్టర్ పధకాలతో కాదు. ఆరోగ్యం ఒక సారి చెడిందంటే డాక్టర్లకి, మందుల షాపుల వాళ్ళకి, డయాగ్నస్టిక్ సెంటర్లకి పాడి కుండలాంటి బిజినెస్! మనకి జేబులకి చిల్లు..మనశ్శాంతి నిల్లు" అన్నది అరుణ తన స్టేట్మెంట్ కి తనే వత్తాసు పలుకుతూ!
(ఇది ఎవరినీ విమర్శించటానికి రాసినది కాదని మనవి. సరదాగా నేటి జీవన విధానంలో సాధారణమై పోయిన అంశాలతో కధ రాద్దామనిపించి రాశాను)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి