ఆ రోజుల్లో రాజులు ఆడి ఆనందించిన ఆటనే
ఈరోజుల్లో పామరుడి ఆటా అయ్యింది
చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ
వయోభేదాలు లేకుండా ఆడుతున్న ఆట
ఎనిమిదిగా విభజించడం
మనిషి జీవితం
ఎనిమిదేసిగా విభజించింది
చదరంగ వేట
తెలుపు నలుపు గడులతో
ఏర్పడిన బోర్డుపై గళ్ళు దాటి
వేసే అడుగులతో
ముడిపడిందీ ఆట తీరు
ఎనిమిది మంది సిపాయిలు
ముందుండగా
నేరుగా దాడి చేసే ఏనుగు దళంతో
ఎగిరి దూకే అశ్వ దళంతో
అడ్డంగా దాడి చేసే ఒంటెలతో
ఎటంటే అటు తిరిగే రాణితో కూడిన
రాజు కదనరంగం
బుద్ధి బలానికి
కత్తి బలానికి చాతుర్యం
మెదడుకి పని పెట్టే చదరంగం
మన భారత దేశ మాతృక చదరంగం
ఒక్కొక్క మగాడి విజయం వెనుకా
ఉండే స్త్రీ ఈ ఆటలో మాత్రం ముందుంటుంది
స్త్రీ హక్కు
ప్రసాదించిందీ చదరంగమే
నేర్చుకోగలిగితే
మెదడు పరిపక్వం చెందుతుంది
రాటు దేలుతుంది
వ్యూహాలు
ప్రతివ్యూహాలు
అడ్డంకులను అధిగమించడానికి
తోడ్పడతాయి
పురోగతికి చేయందిస్తాయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి