నాగుపాము...;- యామిజాల జగదీశ్
 మన దేశంలోని నాగుపాము (ఇండియన్ కోబ్రా) విషపూరితమైనవి. మనదేశంలోనే కాకుండా పాకిస్తాన్,  శ్రీలంక, మయన్మార్, దక్షిణ నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, తూర్పు ఆఫ్ఘనిస్తాన్ తదితర ప్రాంతాలలో నాగుపాముల సంతతిని చూడొచ్చు.
దట్టమైన అడవులలో ఇవి ఎక్కువగా నివసిస్తాయి. అలాగే నీటి మడుగుల సమీపంలో ఇవి కనిపించే అవకాశాలు ఎక్కువ.
పంట పొలాలలో కూడా ఇవి అడపాదడపా కనిపిస్తుంటాయి. సముద్ర మట్టం నుంచి ఆరువేల ఆరు వందల అడుగుల ఎత్తున్న ప్రాంతాలలోనూ ఇవి నివసించగలవు. 
ఇవి ఎక్కువగా తొర్రలు, పొదలను తమ స్థావరాలుగా చేసుకుంటాయి.
నగరాజుగా పిలిచే నాగుపాములు బలంగా కనిపిస్తాయి. ఇవి మూడు నుంచి అయిదు అడుగుల వరకూ పొడవుంటాయి. అయితే కొన్ని నాగుపాములు ఏడు అడుగులపైనే ఉంటాయి. ఇవి ఎక్కువగా శ్రీలంకలో కనిపిస్తాయి.
నాగుపాములు ఏప్రిల్ - జూలై నెలల మధ్య గుడ్లు పెదతాయి. ఆడ పాములు పన్నెండు  నుండి ముప్పై వరకూ బొరియలలో గుడ్లు పెడతాయి. ఇవి దాదాపు ఎనిమిది మొదలుకుని పది వారాల వరకూ గుడ్లను పొదుగుతాయి.  
అప్పుడే పుట్టిన పాములలోసైతం విషపు గ్రంథులు ఉండటం గమనార్హం.
పుట్టేటప్పుడు వీటి పొడవు ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల వరకూ  ఉంటుంది.
నాగుపాము పడగ విప్పి నాదస్వరానికి అనుగుణంగా ఆడటం చూడవలసిన దృశ్యమే. 
నాగుపాములకు వినికిడి శక్తి లేదు. కానీ నాదస్వరం కదలికలు, భూమిలో వచ్చే ప్రకంపనలను గ్రహించి అవి అటూ ఇటూ కదులుతాయి.
పరమేశ్వరుడు ధరించే పాము పేరు వాసుకి. ఇక విష్ణువు శయనించేది ఆదిశేషుడిపైనే.
పాములలోనే కింగ్ కోబ్రా అనే పాము జాతికి చెందినవి కూడా ఉంటాయి. వీటిని కోబ్రా అని అన్నప్పటికీ నిజానికివి కోబ్రా జాతికి చెందవు. ఇవి విషపూరితమైనవి. ప్రమాదకరమైనవి. 
బాగా ఎదిగిన కింగ్ కోబ్రా పొడవు ఎనిమిది నుంచి పద్దెనిమిది అడుగుల వరకూ ఉంటాయి. వీటి ఆయువు ఇరవై అయిదేళ్ళు. 
ఆడ పాములకంటే మగవి పొడవెక్కువ. బరువులోనూ మగ పాములదే పైచేయి. బరువెక్కువ ఉన్నప్పటికీ ఇవి చురుగ్గా వేగంగా కదులుతాయి. 
మయన్మార్, కంబోడియా, లావోస్, థాయిలాండ్, వియతానం, మలేసియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా ప్రాంతాలలో కింగ్ కోబ్రాలు ఎక్కువ. ఇవి మిగిలిన పాములను ఇట్టే లాగించేస్తాయి. అందుకే వీటిని కింగ్ కోబ్రా అనే పేరు వచ్చినట్టు చెప్తారు. 
దీని తల భాగం పెద్దగా ఉంటుంది. కింగ్ కోబ్రా ఓసారి కాటేసిందంటే కనీసం అయిదు వందల మిల్లీగ్రాముల మేరకు విషం చిమ్ముతుంది.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం