మంచు దారుల వెంట
మెరుగు బంగరు వెలుగులతేరు
నునువెచ్చని స్పర్శకు
కరిగినీరైన కలతలు
హిమశకలముల కింద
బేలయై నిలిచిన సరసు మనసు
హిమమంటి అహం
వెచ్చని స్పర్శకు దాసోహం
గాడమైన హిమపరిష్వంగంలో
బందీ అయిన భువనం
వెలుగుల వేలుపు వెచ్చగ
తాకగ మురిసె మురిపెం
మురిపించు మనసులా
స్వఛ్ఛమైన తెల్లటి మంచు
ముత్యాల రాశులు
నింగి కురిపించు నీహారికలు
మనసులలోని అహాలు కరిగే
మమతల బంధాలు పెరిగే
చిక్కని కిరణాల వెలుగే
ధరణికి తరగని వరమే!
హిమవనంలో భానూదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి