వర్ణించు...వర్జించు
*****
ఈ లోకంలో ప్రశంస అంటే ఇష్టపడని వారు ఎవరో కొంతమంది మాత్రమే ఉంటారు.అలాంటి వారు వర్ణించుటను ఒప్పుకోరు. అభినందనలు,మెచ్చుకోలు,శ్లాఘించుటను ఒక్క చిరునవ్వుతో ఆపేయిస్తారు.తమ పని తాము చేసుకుంటూ వెళుతుంటారు.అలాంటి వారిని మనం స్థితప్రజ్ఞత కలవారు అంటాం.
కానీ ఎక్కువ శాతం పిల్లలైనా పెద్దలైనా తాము చేసే పనులను ఇతరులు గుర్తించి వర్ణించాలని కోరుకోవడం సహజం. అది చాలా వరకు మానవ నైజం కూడా.
పసితనంలో పిల్లలు ఏవైనా కొత్త పదాలను నేర్చుకుని మాట్లాడినా, వారి చిన్ని చిన్ని చేతులతో మనకు సహాయం చేసినా వారిని కొంచెం వర్ణించితే చాలు, అలాంటివి ఎంతో ఇష్టంగా మరికొన్ని చేస్తూ ఉండటం చూస్తుంటాం.
పాఠశాలలో విద్యార్థులు కూడా అంతే.కొంచెం వర్ణించితే చాలు.రెట్టింపు ఉత్సాహంతో బాగా చదవడం ఉపాధ్యాయులకు తెలిసిందే.
ఇంతకూ వర్ణించు అంటే ఏమిటో చూద్దాం... వర్ణించు అంటే స్తుతించు,అభినందించు,అభిమతించు,ఉత్కర్షించు,గణించు,నుతించు, కొనియాడు,ప్రణుతించు, మెచ్చుకొను శ్లాఘించు, ప్రశంసించు లాంటి అర్థాలు ఉన్నాయి.
అయితే కొందరు మాత్రం పొగడ్తల కోసం తపిస్తూ, తమను గుర్తించాలనీ అభినందనలతో ముంచెత్తాలని కోరుకుంటూ ఉంటారు.
"ప్రశంస పన్నీరు లాంటిది వాసన చూసి వదిలేయాలి కానీ ఆ వర్ణించుట కోసం ఎదురు చూడకూడదు" అంటుంటారు పెద్దలు.
అందుకే అలాంటి కోరికను తక్షణమే వర్జించాలి. చేసేది మంచి పనైతే ఏనాటికైనా గుర్తింపు వస్తుంది. మరికొందరేమో ఇతరుల అభివృద్ధి,పేరు ప్రతిష్టలను చూసి తట్టుకోలేక ఈర్ష్య అసూయలతో రగిలిపోతూ ఉంటారు.అది అనారోగ్య హేతువు,మనిషితనం కాదని గమనించాలి. అలాంటి లక్షణాలు మనసులో పొడసూపితే వెంటనే వర్జించాలి.
వర్జించు అంటే ఏమిటో చూద్దాం...వర్జించు అంటే త్యజించు,ఉదలు,పరిత్యజించు,పరిహరించు,మాను,విడనాడు, విసర్జించు, విడిచి పెట్టు లాంటి అర్థాలు ఉన్నాయి.
ఇతరులలోని మంచిని వర్ణించాలి. మనలోని చెడును వర్జించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి