మనసులో కలతలన్నీ
కరిగిపోవాలి....
మదిలో కోరికలన్నీ
నెరవేరాలి.
సమస్యల వలయాలన్నీ
ఛేదించాలి.
అడ్డంకుల గోడలన్నీ
కూలదొయ్యాలి.
అవమానాల గరళాన్ని
కంఠంలో నిలపాలి.
అనుమానాల తెరలన్నీ
తొలగించుకోవాలి.
అడుగు వెనుక అడుగుగా
ఆత్మవిశ్వాసం గొడుగుగా
కంటి చూపు పదునుగా
నోటి మాట కుదురుగా
గెలుపు ఓటములు
ఒకేరకంగా.....
ఊహలు.ఉత్సాహం
ఊపిరిగా
అగకుండ సాగిపో నేస్తమా నీదారి
ఎందరున్నా నీ పయనం ఒంటరే

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి