వస్తున్నాయి వస్తున్నాయి !
జనార్ధన రథచక్రాలు !!
వస్తున్నాయి వస్తున్నాయి !!!
ఏడవకండి ఏడవకండి!
పతితులారా బ్రస్టులారా
బాధాసర్పద్రస్టులిరా!!
ఏడవకండి ఏడవకండి!!!
వస్తున్నాయి వస్తున్నాయి
మర్రి జనార్ధన రథచక్రాలు!!
వస్తున్నాయి వస్తున్నా యి!!
నాగర్ కర్నూల్
దాన కర్ణుడు మన మర్రి!!
నాగం నడవని బాటలు నడిచి
జనమంతా జగమంతా పొగిడిన
జనార్ధనుడు మన మర్రి!!
ధనం పై ఆశ లేదు!
అధికారం పై వ్యామోహం లేదు!!
కీర్తి పైకాంచలేదు!!!
ఉన్నదంతా సేవాభావం!
ఉన్నదంతా స్నేహభావం!!
ఉన్నదంతా పంచి ఇచ్చే ఉన్నత
ఉదార స్వభావం మన మర్రిది!!
అతని లక్ష్యం పెద్దలు కాదు పేదలు!
అతని లక్ష్యం లక్ష్మీ కాదు సరస్వతి
అతని లక్ష్యం వాగ్దాటి కాదు వాగ్దానం!!
అతని లక్ష్యం మౌనంగా ఎదగడం!!!
అతని లక్ష్యం ప్రతిపక్షం కాదు ప్రజలు!!!
ఎంత ఎదిగిన ఒదిగివున్న!
మహా మర్రి మన మర్రి!!
ఈడు వచ్చిన ఆడపిల్లలకు
అమ్మానాన్న అన్నా అన్ని!!
కన్య లందరికీ కన్యాదానం చేసి
పెళ్లిళ్లు చేసి ఆదుకున్న
ఆత్మబంధువు మన మర్రి!!!
ఊరికో గుడి కాదు
ఊరికో ఉన్నత బడి కావాలని
బాల బాలికలకు అత్యాధునిక
బడులు నిర్మించిన బ్రహ్మ మనమర్రి!!
ఆదాయం ఆతని గుణం కాదు
దయ అతని గుణం!!
వ్యాపారం అతని వ్యవహారం కాదు
సహకారం ఆతని ధనం!!
వేగం కాదు నిదానం అతని గుణం
కులం ధనం ముఖ్యం కాదని
కాలం కర్మ ముఖ్యమనీ నమ్మిన
కర్మయోగి మనమర్రి!!
ఆకాశంలో పూసిన ఒక పువ్వు
పేదల గుండెల్లో ఒక చిరునవ్వు
మన మర్రి!!!
ప్రార్థిస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడో లేదో కానీ
పేరు పెట్టి పిలిస్తే
వెంటనే పలకరించే మంచి నాయకుడు
మన మర్రి!!?
మంచి నాయకుడు మర్రి జనార్దన్ రెడ్డికి ఒక మంచి కవిత అంకితం.
Pratap koutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి