ఒప్పించు... తప్పించు
******
ఏదైనా విషయాన్ని ఎదుటి వారిని ఒప్పించడం అంత తేలికైన విషయం కాదు. కొందరు "తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు" ఎవరు ఏది చెప్పినా ఒప్పుకోరు.తాము చెప్పిందే, చేసిందే ఒప్పు అనే భావనలో ఉంటారు.
అలాంటి వ్యక్తి గురించి సరదాగా అంటుంటారు "వాడు సీతయ్య ఎవరు చెప్పినా వినడు" అని.
ఇలాంటి వారిని ఒప్పించాలంటే వారి మాటలు తీసేయకుండా చెప్పింది సావధానంగా వినాలి. విన్న తర్వాత ఆవేశపడకుండా వారి ఆలోచనల్లో లోపాలను క్షుణ్ణంగా చర్చించి నెమ్మదిగా ఒప్పించాలి.ఇది అంత త్వరగా సాధ్యం కాదు కానీ ప్రయత్నం, నమ్మకం ద్వారా వారిలో మార్పు తీసుకుని రావచ్చు.
ఒప్పించు అంటే సాధారణంగా వాడుకలో అంగీకరింపజేయు అని అర్థం ఉన్నప్పటికీ ఒప్పగించు అర్పించు,చేర్చు,ఇచ్చు, వశము చేయు అనే అర్థాలు ఉన్నాయి.
ఎక్కువగా పిల్లలు తమ మూర్ఖత్వం మొండితనం,తెలిసీ తెలియని తనం వల్ల అనేక ఇబ్బందులను సమస్యలను కొని తెచ్చుకుంటారు.అలాంటి వాటిని తప్పించుటకు పెద్దలు ప్రయత్నం చేయాలి.
చిన్నప్పటి నుండే వారిలోని ఇలాంటి అనారోగ్యకరమైన లక్షణాలను పసిగట్టి వాటినుండి తప్పించాలి. సందేహాలు సంశయాలు తొలగించి వారిలో విజ్ఞత వివేకం ,విషయ పరిజ్ఞానం కలిగించాలి.అపోహలను దూరం చేయాలి.
మరి తప్పించు పదానికి ఏయే అర్థాలున్నాయో చూద్దాం.తప్పించు అంటే తొలగించు, పోగొట్టు,విప్పు,విడుచు,దూరము చేయు అనే అర్థాలు ఉన్నాయి.
మంచి మార్గంలో పయనించేందుకు ఒప్పించాలి.చెడు అలవాట్ల నుండి తప్పించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి