మేకప్!!?;-సునీతా ‌- ప్రతాప్, ఉపాధ్యాయిని, పాలెం.
ఆడవాళ్ళందరూ
అందంగానే ఉంటారు!!

అందంగా కనబడాలని
అలవాటు పడకండి!!
మేకప్ ను
అలవాటు చేసుకోకండి!!

ఆడవాళ్లు అందరూ
సహజంగా కనపడండి!!
జనం మెచ్చాలని కాదు
నిజంగా కనపడండి!!?

జనం నిజానికి 
అలవాటు పడతారు!!

ఆఫ్రికా వాళ్లను
ఆఫ్రికా వాళ్లు ఇష్టపడ్డట్లు
అమెరికా వాళ్లను
అమెరికా వాళ్లు ఇష్టపడ్డట్లు

మనల్ని మనం ఇష్టపడతాం
మేకప్పులు లేకుండానే
దీన్ని ఒప్పుకుందాం!!

ఉన్నది ఉన్నట్లుగానే
చూడడానికి అలవాటు పడదాం!!

అందమంటే అద్దంలో కనిపించేది కాదు
నీ మనసుకు కనిపించేది!!
అందమంటే రంగు కాదు
రంగుల్ని పీల్చుకునే చర్మం కాదు
పదార్థ ధర్మం!!!?

పుట్టుకతో అందం కోసం ఆశపడదాం
కానీ వేషం మాత్రం ఒక వ్యసనం!!
అది సమాజానికి ఒక విషం!!!
ఒక నిమిషం ఆలోచించండి!!?

అందం అంటేనే ఆడవాళ్లు!!!

అందానికి కాస్మోటిక్స్ డ్రగ్స్ లాంటివి
వాటికి అడిక్ట్ కాకండి!!

అలంకరించుకోండి కానీ
వేషం వేసుకోకండి!!

ఉన్నది ఉన్నట్లుగా ఉండండి
అందరూ అలా చూడడానికే 
అలవాటు పడతారు!! గుర్తుపడతారు!!
దాన్ని అందంగా గుర్తిస్తారు!!!

Sunita Pratap teacher palem nagarkurnool dist 🙏🙏
8309529273.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం