మగతనిదుర పోతున్న
జగానికి మేలుకొలుపు
అవని మీద కొత్త చివురుల
అమితమైన ఆనందం
చిరునవ్వుల వరమిస్తూ
పరచుకున్న వెచ్చదనం
మమతలన్ని పొంగిపోగ
మురిసిపోయి విరిసిన వనం
నింగిలోని తారక తీరున
తీగను మెరిసిన కొత్త సుమం
మనసును కుదిపే కొత్త ఆశల
మాలలు గుచ్చిన భావనలు
ఆనందం తో పిచ్చిదైన మనసు ఊయలూగిన ఊహలు
గుప్పెడంత గుండెలో
ఉప్పెనలా ఉత్సాహం నింపి
రెప్పచాటు కలలన్నీ
రెక్కలు విప్పుకుని ఎగిరేలా
ఎక్కడ వాలితే అక్కడే
స్వర్గాలుగా మలచుకునే
కాలమంతా వసంతాలే
నిలుపుకునే సహనమిచ్చే
సత్యసుందరమైన
ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి