మనసా! ఓ మనసా!;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మనసా! ఓ మనసా!
తృప్తిపడవు ఎందుకే మనసా!
కన్నీటితో నిన్ను కడగనా 
నిప్పుతో నిన్ను నిమరనా 

పదవులొచ్చినా
ప్రశంసలొచ్చినా
ప్రఖ్యాతివచ్చినా
తృప్తిపడవు ఎందుకే మనసా

నీ మర్మమేమిటో
నీ కర్మమేమిటో
నీ ధర్మమేమిటో
తృప్తిపడవు ఎందుకే మనసా

ఆస్తులు కూడినా
అంతస్తులు పెరిగినా
ఆప్తులు చేరినా
తృప్తిపడవు ఎందుకే మనసా

భార్య వచ్చినా
బిడ్డలు కలిగినా
బంధువులు మూగినా
తృప్తిపడవు ఎందుకే మనసా

గడ్డముపట్టి
నిన్ను బ్రతిమలాడనా మనసా
బెత్తముపట్టి
నిన్ను బెదిరించనా మనసా

కర్రతో కొట్టినా
ఘాటుగా తిట్టినా
చుట్టచుట్టి కట్టకట్టినా
తృప్తిపడవు ఎందుకే మనసా

అందాలు చూచినా
ఆనందము పొందినా
అవసరాలు తీరినా
తృప్తిపడవు ఎందుకే మనసా

కడుపు నిండినా
కోరిక తీరినా
కష్టాలు తొలిగినా
తృప్తిపడవు ఎందుకే మనసా

మనుమడు ముద్దిచ్చినా
మనుమరాలు మురిపించినా
మిత్రులు మెచ్చినా
తృప్తిపడవు ఎందుకే మనసా

కవితలు కమ్మగా వ్రాసినా
కితాబులు కోకొల్లలుగా వచ్చినా
కవులను కట్టిపడవేసినా
తృప్తిపడవు ఎందుకే మనసా


కామెంట్‌లు