సుప్రభాత కవిత ; -బృంద
అలజడిలో అంతరంగం
అలసిపోని ఆరాటం

భయపెడుతున్న చీకట్లు
అడియాసల పోరాటాలు

పరుగులెట్టే కెరటాలు
వెనక్కు లాగే మోమాటాలు

నిలదీసే సమస్యలు
సణుగుతూ సంజాయిషీలు

అంతరంగ మధనాలు
పరిష్కార శోధనలు

దారంతా ముళ్ళున్నా
ధైర్యమే  పాదాలకు రక్ష

నిశీధి కరగిపోతూనే వుంది
ఉషస్సు దగ్గరవుతూనే వుంది

ఆకాంక్షల  వెల్లువై
మీమాంసలు తొలగించి

దిశానిర్దేశం చేసే దినకరుడి
తొలికిరణాలకై ఎదురు చూస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు