పిల్లి పిలుపు మ్యావ్ మ్యావ్;--ఎడ్ల లక్ష్మి--సిద్దిపేట
చిత్రానికి బాలగేయము
---------------------------------
చిట్టి పొట్టి పిల్లండి
చిన్నబోయి చూస్తుంది
బంతి పట్టుక కూర్చుంది
బలే బలేగా ఉన్నది !!

చిట్టి పొట్టి చెవులు
నిక్కబెట్టుకున్నది
గుండ్రనైన కళ్ళను
తిప్పి తిప్పి చూస్తుంది !!

మ్యావ్ మ్యావ్ మంటూ
నేను వస్తున్నానంటూ
చిన్నారి పాపలకు
కబురు పెట్టుచున్నది !!

దాని పిలుపు వినరండి
పిల్లలంతా రారండి
పిల్లి తో బంతి ఆటలు
వింత గుండు చూడండి !!


కామెంట్‌లు