అనగనగా ఓ పుట్టలో ఓ పాముండేది. అది చాలా కాలంగా పెద్ద పెద్ద జంతువులను సైతం ఆహారంగా చేసుకుని మింగేస్తుండేది. దాంతో తనే బలశాలినని అనుకుంటూ ఉండేది.
అయినా తన శక్తిని పరీక్షించుకోవడానికి ఓరోజు పుట్టలోంచి బయటకు వస్తుంది పాము.
అప్పుడు ఓ ముంగిస కనిపించడంతోనే పాము భయంతో దాక్కుంటుంది.
"ఆహా! ముంగిసే నా కన్నా బలశాలి" అనుకుంటుంది పాము.
ఇంతలో అక్కడికి వచ్చిన ఓ పిల్లి ముంగిసను తరుముతుంది. అది చూసిన పాము "పిల్లే ముంగిస కంటే బలశాలి" అనుకుంటుంది.
కాస్సేపటికే ఓ కుక్క అటుగా వచ్చి పిల్లిని తరుముతుంది. అదీ చూసిన పాము "అబ్బో కుక్కే పిల్లి కంటే బలవంతురాలు" అని అనుకుంటుంది.
పిల్లిని తరుముతున్న కుక్కకాస్తా ఓ మనిషి తయారు చేస్తున్న ఓ పచ్చి కుండలో పొరపాటున పడుతుంది.
దాంతో కోపంతో రెచ్చిపోయిన ఆ మనిషి కర్రతో కుక్కను కొడతాడు. కుక్క అక్కడి నుంచి పరుగో పరుగు.
అది చూసిన పాము "కుక్క కన్నా మనిషే బలవంతుడు" అనుకుంటూ అప్పటివరకూ చెట్టు చాటున నక్కి ఉన్న పాము బయటకు వస్తుంది.
పామును చూడటంతోనే అయ్యో అయ్యో పాము అంటూ మనిషి అక్కడి నుంచి పరిగెడతాడు.
మనిషి పరుగు చూసి పాము "ఈ ప్రపంచంలో అన్నింటికన్నా నేనే బలశాలిని" అని లోలోపల గర్వపడుతుంది.
సరిగ్గా ఆ సమయంలోనే తాను మొదట చూసిన ముంగిస మళ్ళీ అక్కడకు రావడంతోనే "అయ్యో ....అమ్మా" అని వేగంగా పాక్కుంటూ పుట్టలోకి పోయి దాక్కుంటుంది.
ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తనకు తాను పెద్దవాడినని అనుకోకూడదనడానికే ఈ పాము కథను ప్రస్తావించడమైంది. ఆ భగవంతుడు ఈ ప్రకృతిలో ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యర్థిని సృష్టించాడు. ఒకరిని మించి మరొకరు బలవంతుడై ఉంటాడనే నిజం తెలుసుకుని ఆ మేరకు నడచుకుంటే చాలు జీవితం సాఫీగా సాగిపోతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి