అంతరంగాన్ని తట్టిన
ఆలోచనలను ఆపకండి
ఆరంభించినవాటిని సాగించండి
అంతముచేయక పారించండి
మదులను
మేలుకొలపండి
మెరిపించండి
మురిపించండి
కలాలకు
పదునుపెట్టండి
కవితలకు
రంగులనద్దండి
విషయాలకు
వలవేయండి
వెదికిపట్టుకోండి
వండివడ్డించండి
అందాలను
చూపండి
వర్ణించండి
అలరించండి
ఆనందాలను
పంచిపెట్టండి
పులకరించండి
పరవశింపజేయండి
అంత్యప్రాసలు
అనుప్రాసలు
అలంకారాలు
అన్నీప్రయోగించండి
పదవిన్యాసాలను
ప్రదర్శించండి
పలుకవితలను
పుటలకెక్కించండి
కవనప్రవాహమును
కొనసాగించండి
కొత్తప్రక్రియలను
కనిపెట్టండి
చదవనీ చదవకపోనీ
పొగడనీ పొగడకపోనీ
కలాలను కదిలిస్తుండండి
కవితలను కురిపిస్తుండండి
పిల్లలకు
విద్యాబుద్ధులు నేర్పండి
పెద్దలకు
స్వాంతన కలిగించండి
యువతకు
సక్రమమార్గం చూపండి
సమాజాన్ని
చైతన్య పరచండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి