కోటి ఆశల ఆహ్వానం;- సుమ కైకాల
నిన్నలోని చేదు ఘటనలను వదిలేసి
రేపటి వెలుగు రేకలకై ఎదురుచూస్తూ
ఆశగా నూతనవత్సరాన్ని స్వాగతిద్దాం
రాబోయే ఆనందాలను ఆహ్వానిద్దాం...

గత ఏడాది చేయలేని మంచి పనులు
అసంపూర్తిగా మిగిలిన ఆశయాలు
బాధించి వేధించిన మానసిక ఒత్తిడిలు
వైఫల్యంతో చేరువ కాలేని విజయాలు

కొంగ్రొత్త వత్సరంలో కోరికలు నెరవేరాలని
సత్కార్యాలు ఎన్నెన్నో సజావుగా చేయాలని
అశాంతులు రూపుమాసి శాంతులు
నెలకొనాలని
అపజయాల నెదుర్కొని విజయాలను
సాధించాలని

సమాజం అభివృద్ధి పథoలో నడవాలని
ప్రజలందరూ ప్రగతిమార్గంలో పయనించాలని
నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం...
శుభాలెన్నో కలుగుతాయని ఆశిద్దాం!!!

కామెంట్‌లు