ఖమ్మం వురిమెల్ల ఫౌండేషన్-అక్షరాల తోవ సాహితీ సంస్థ వారు తిరుపతి రచయిత ఆర్సీ కృష్ణ స్వామి రాజు రచించిన 'ఎర్ర మట్టి' కథకు నేడు ఖమ్మంలో బహుమతి అందించారు.
ఇటీవల వారు నిర్వహించిన జాతీయ కథల పోటీలో ఎర్రమట్టి కథకి తృతీయ బహుమతి లభించింది. మూగజీవాల రక్షణ, పశు వైద్యుల ప్రాధాన్యతలను తెలియజేసే బలమైన కథావస్తువు వున్న కథగా నిర్వాహకులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో సాహితీ ప్రియులు ఉపేందర్ రావు, సునంద, ఉపేందర్, శ్రీనివాస్, సత్యనారాయణ గుప్త, నామా పురుషోత్తం,శ్రీ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి