సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 విశయము... విషయము 
 ******
విశయము మనసును తొలుస్తుంటే వివేకము పదే పదే  ఆలోచిస్తుంది. మబ్బు తెర లాంటి విశయము వీడితే గానీ  మనసు కుదుట పడదు.
విశయములను ఎప్పటి కప్పుడు తీర్చుకోవడం జ్ఞానవంతుల  లక్షణము.
అసలు విశయము అంటే ఏమిటో చూద్దాం... సందేహము, అనుమానము,అరగలి,అరమర,శంక, సందిగ్ధము,వితర్కము,సందియము,సంశీతి,సంసయము,వికల్పము లాంటి అర్థాలతో పాటు నివాస స్థానము అనే అర్థం కూడా ఉంది.
విశయము గురించిన వివిధ అర్థాల విషయము తెలిసింది కదా!మనకు.
మనం  ఉండే విషయాన్ని ప్రేమించాలి.ఈ విషయముపై జన్మించడమే మన అదృష్టంగా భావించాలి.దేశభక్తిని కలిగి వుండాలి. దేశభక్తులకు సంబంధించిన జీవిత చరిత్ర గ్రంథములను బాగా చదివి, అందులోని విషయమును ఆకలింపు చేసుకోవాలి.
విషయము గురించిన విశయము వీడింది కదా ఇప్పుడు విషయము అంటే ఏమిటో చూద్దాం... సంగతి,ఇంద్రియార్థము, లౌకికార్థము,పాయకట్టు, గోచరము,గ్రంథాదులందు ఉండు సారాంశముతో పాటుగా శరణము, దేశము, నిమిత్తము, వస్తువు,రేతస్సు, రాజ్యము, పెద్ద పట్టణమునకు సమీపంలో ఉన్న ఉప గ్రామముల సమూహము,రాష్ట్రము, పుడమి, భూమి, ముంజ గడ్డి, మండలము లాంటి అర్థాలు ఉన్నాయి.
మనకు కలిగే విశయములను వెంటనే నివృత్తి చేసుకోవాలి.విషయమును ఆమూలాగ్రం అవగాహన చేసుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం