క్షేత్రంలో
పడిపోయిన
విత్తనం అమ్మ!!
ఒంటరిగా నిలబడి
అరణ్యాన్ని సృష్టించిన
చెట్టు అమ్మ!!
నన్ను నేను
దీపాన్నై వెలిగిస్తే
దీపకల్పాన్నిచ్చిన
అమ్మా!!
నన్ను నేను
చిరునవ్వై చిగురిస్తే
తడి రక్తంతో
తలంటిన అమ్మ!!
ఏడు వింతలు
తెలియని అమ్మకు
నేనొక విశ్వవింతను!!?
తన చుట్టూ తాను తిరిగి
నా చుట్టూ గిరగిరా తిరిగే
భూమి అమ్మ!!?
నా చుట్టూ ఆవహించి
నన్నే పట్టుకున్న
కనిపించని గాలి అమ్మ!!?
పచ్చని పత్రహరితంతో
ఎర్రని రక్తాన్ని తయారుచేసి
తెల్లని పాలనిచ్చిన
చల్లని ఆవు అమ్మ!!
సూర్యుని ఆపి
చీకటిని సృష్టించి
నన్ను నిద్రపుచ్చిన
అర్థగోళం భద్రకాళి అమ్మ!!?
అమ్మ చరణాలను
వీడని నాకు
మరణం లేదు
అమ్మకు అమరత్వం నేను!
అమ్మ చేసిన వాగ్దానం నేను!!
====================
అమ్మ కు అంకితం
====================
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి