అనృతము... సూనృతము
****
కొందరు నోరు తెరిచారంటే అన్నీ అనృతములే. అలవోకగా అనృతములతో ఎదుటి వారిని బురిడీ కొట్టించి తమ అవసరాలను తీర్చుకుంటారు. అలా చేయడం వల్ల ఎదుటి వారి దృష్టిలో ఎంత చులకన అయిపోతారో మరెంత నమ్మకం కోల్పోతారో వాళ్ళ మనసుకు తట్టదెందుకో.
అనృతము కొంగున కట్టుకున్న నిప్పు లాంటిది.ఏనాటికైనా బయట పడక మానదు.
అందుకే పెద్దలు అంటుంటారు అబద్ధాల బతుకంత హీనమైనది మరొకటి లేదని.
ఈ పాటికి అర్థమై వుంటుంది అనృతమ అంటే ఏమిటో... అసత్యము, అబద్ధము, కల్లబొల్లి మాట,బూటకము, బొంకు,మాయ, మిథ్య, హుళక్కి లాంటి అర్థాలు ఉన్నాయి.
అలాంటి అనృతమునకు దూరంగా ఉండాలి. సూనృతమునే ఎల్లప్పుడూ పలుకాలి.సూనృతమును పలికేవారంటే అందరికీ గౌరవమే.
అలాంటి వ్యక్తులు ఉండటం వల్లే సమాజం ఈమాత్రమైనా నైతిక విలువలతో కూడి సజావుగా నడుస్తోంది. మనుషుల మీద ఇంకా నమ్మకం కోల్పోకుండా ఉన్నాం.
సూనృతము అంటే ఏమిటో చూద్దాం...సత్య వచనము, శుభము, కల్యాణము, మంగళము క్షేమము, మేలిమి, మేలు,అమృషోక్తి లాంటి అనేక శుభకరమైన అర్థాలు ఉన్నాయి.
కాబట్టి సమాజ శ్రేయస్సును కోరే సూనృతమును వ్రతముగా ఆచరించాలి.
పిల్లలను అనృతములు మాట్లాడకుండా సూనృతములను మాట్లాడే విధంగా పెంచాలి. సూనృతము గురించి ఆవు- పులి,సత్య హరిశ్చంద్రుడు మొదలైన కథలు చెప్పి సన్మార్గంలో నడిచేలా చేయాలి.
అనృతము అందరికీ దూరం చేస్తుంది. సూనృతము శుభాల నిలయమై గౌరవాన్ని పెంపొందిస్తుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి