బ్రహ్మ విష్ణు శివులతేజం
భవ్య గురు రూపంలో
శ్రీ దత్త దర్శనం !
పిలిచిన పలికే దివ్య అనుగ్రహం !
బలిమి సంసారబంధం తొలిగే !
అనసూయాత్రిల సుతుండు
అమేయ జ్ఞానసంపన్నుడు
ప్రకృతి ఆరాధకుడు,పరమపావనమూర్తి !
మూగజీవుల ప్రేమ ముక్తిమార్గమనియె !
జటలలో బంధించి జాడ్యములన్నీ
రుద్రాక్షమాలలో రూపుదాల్చిన వేదాలు
శరణు శరణు శ్రీదత్త మహాగురు !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి