అనుముల గ్రామంలో శివ, చరణ్, గణేష్, పండు, దినేష్ అనే ఐదుగురు అన్నదమ్ములు ఉండేవారు.ఈ ఐదుగురు ఒకరోజు సినిమాకు వెళ్లారు. సినిమా పూర్తి అయిన తర్వాత ఇంటికి పోతున్నప్పుడు గణేష్ మనం కూడా సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్నాడు. వాళ్ళ అన్నలు నవ్వి మనకు అంత సీన్ లేదు అని ఎగతాళిగా అన్నారు. గణేష్ అప్పుడు నిరుత్సాహపడ్డా ప్రతిరోజు బాగా కథలు చదివి సినిమా కోసం కొత్తగా కథ రాయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు కథ రాయడం మొదలుపెట్టాడు రెండు రోజుల్లో తనకు నచ్చిన ఒక మంచి కథ రాసేశాడు. వాళ్ల నాన్న గణేష్ చేస్తున్న ప్రయత్నాన్ని గమనించాడు. గణేష్ కు తెలవకుండా అతను రాసిన కథను చదివి ఒక పత్రికకు పంపించాడు. కథ పత్రికలో అచ్చు అయింది. ఆ కథను ఒక పెద్ద సినిమా నిర్మాత చదివాడు. దానిని సినిమాగా తీయాలని అనుకొని గణేష్ ను వెతుక్కుంటూ అనుముల గ్రామానికి వచ్చాడు. గణేష్ ప్రతిభను చూసి అన్నదమ్ములు తక్కువ అంచనా వేసినందుకు సిగ్గుపడ్డారు. క్షమించమని వేడుకున్నారు. గణేష్ ప్రతిభను అందరూ మెచ్చుకున్నారు.
నీతి : ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ తప్పక ఉంటుంది
నీతి : ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ తప్పక ఉంటుంది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి