రేయి కురిసిన మంచు
మల్లెలు పరచినట్టు
వెన్నెల చల్లదనం
మల్లెకిచ్చినట్టూ......
ప్రత్యూష వేళ మెరిసే
నీహారికా బిందువుల
సమూహ కాంతి.....
ప్రభాత భానుని తొలి
కిరణాల తాకి సంతోషంతో
పుత్తడిలా కరిగి నీరైనట్టూ...
మనసున గూడుకట్టిన
గుబులు గువ్వలు
వేకువనే ఎగిరి వెళ్ళిపోయినట్టూ...
తొలిపొద్దున నిండుగ వెలిగే
తూరుపు దిక్కు..పండుగలా
ఎరుపు రంగు అలుముకున్నట్టూ..
పోరాడు పటిమనిచ్చు
నూతన విశ్వాస బలమిచ్చి
చేయిపట్టి దైవం నడిపినట్టూ...
రెక్కలపై నమ్మకాన్ని
తక్కువ కానివ్వకుండా
ముక్కలై పోకుండా నిలిపినట్టూ..
బంగరు వెలుగులు
తెచ్చిన ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి