మనం సాధారణంగా అనుకుంటాం డబ్బు ఉంటే చాలు అంతా సంతోషం సర్వస్వం అని. నేడు డబ్బున్నా వారికి ఎన్నో సమస్యలు రోగాలు మానసిక అశాంతి. ఇతరుల కళ్ళలో ఆనందం కనిపించేలా చేయగలిగితే దాన్ని మించిన సంతోషం లేదు సుమా! లక్జరీలతో అనారోగ్యం! మనకు కారు లేదు అని బాధపడరాదు.నడవటానికి కాళ్ళు ఇచ్చాడని సంతోషించాలి. ఫెమిఒటెడోల అనే నైజీరియా వాసి కోటీశ్వరుడు. "మీ జీవితంలో సంతోషకరమైన రోజు ఫలానాది అని మీరు చెప్పగలరా?" దానికి ఆయన ఇచ్చిన జవాబు ఇది" నాఇల్లు సంపద సంతోషం ఇవ్వడం లేదు. కానీ 200మంది దివ్యాంగబాలలకు వీల్ ఛైర్లు ఇచ్చినప్పుడు అందులో కూచుని ఆపిల్లలు నవ్వులతో కేరింతలు కొట్టడం అమిత ఆనందాన్ని ఇచ్చింది. ఓబాబు నాకాళ్లు గట్టిగా పట్టుకుని "అంకుల్!మీమొహాన్ని సరిగ్గా తనివితీరా చూడనివ్వండి.మీరు ఎక్కడ కనపడితే అక్కడ మిమ్మల్ని గుర్తించాలి నేను!ఆఖరికి స్వర్గంలో నైనాసరే! ఆఆనందం నాజీవితంలో మధురానుభూతి ". ఇతరులకి
ఆనందం కలిగించి వారి కళ్ళల్లో వెలుగులు నింపటమే మంచి మనిషి ధర్మం 🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి