జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి, కరీంనగర్ గారి ఆదేశముల మేరకు మరియు తెలంగాణా గణిత ఫోరం -కరీంనగర్ జిల్లా విభాగం వారి సూచనల ప్రకారం తేది: 13-12-2022 (బుధవారం) రోజున జమ్మికుంట మరియు ఇల్లందకుంట మండలాలలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు చెందిన 10 వ తరగతి విద్యార్థులకు మండల స్థాయి గణిత ప్రతిభా పాటవ పోటిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,బాలురు జమ్మికుంటలో నిర్వహించనైనది.ఇట్టి పోటికి తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాల నుండి 40 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ పోటిలో క్రింద పేర్కొనబడిన విద్యార్థులు ప్రథములుగా నిలిచారు.వీరు జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీలకు ఎంపికకావడం జరిగింది.
తెలుగు మీడియం:(జమ్మికుంట)
1.ఎస్ దీపిక (ZPHS బాలురు జమ్మికుంట)
2.పి స్వాతి (ZPHS బాలురు, జమ్మికుంట)
3.టి సురేష్ (ZPHS కోరపల్లి)
ఇంగ్లీష్ మీడియం:(జమ్మికుంట)
1.ఎస్ అమూల్య ( KGBV జమ్మికుంట)
2.ఎ సాహితీ (ZPHS బాలికలు, జమ్మికుంట)
3.జె గౌతమి ( ZPHS కొత్తపల్లి)
ఇంగ్లీష్ మీడియం:(ఇల్లందకుంట)
1.ఎం అక్షిత (జి.ప.ఉ.పా.సిరిసేడు)
2.డి రచన (కెజిబివి ఇల్లందకుంట)
3.ఎస్ అలేఖ్య (జి.ప.ఉ.పా.సిరిసేడు)
ఇట్టి కార్యక్రమానికి జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల మండల విద్యాధికారి శ్రీ విడపు శ్రీనివాస్ గారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆకుల సదానందం గారు,TMF మండల శాఖ బాధ్యులు బాదం సురేష్ బాబు,వల్లంపట్ల చంద్రమౌళి,నల్లగొండ సదానందం ,అడిగొప్పుల సదయ్య,ఎం రాజేష్ బాబు,వీరలక్ష్మి,ఎం సునీత, గంగ,వివిధ పాఠశాలల గణితోపాధ్యాయులు పాల్గొన్నారు.
విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మండల విద్యాధికారి శ్రీనివాస్ గారు ప్రశంసాపత్రాలను అందజేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి