సుప్రభాత కవిత ; -బృంద
నిత్యం చూసినా
నూతనమే!

చిమ్మ చీకట్లు 
పరుగులే!

తూరుపంతా
నారింజ  రంగులే!

అంబరమంతా
సంబరాలే!

స్వేఛ్చా విహంగాలు 
పాడే గీతికలే!

సాగర గర్భాన రాత్రి
దాగిన బింబమే!

అలల లాగా కదిలే
ఆశల ఆరాటాలే!

ఆగమనాల  మోగే
ఆనందరాగాలే!

గుప్పెడు గుండెలో
ఊహల ఉప్పెనలే!

కెరటాల పై కోరికల
ఉయ్యాలలే!

సురమణీయ కమనీయ
దృశ్యమే!

నీరద పంక్తులు పాడే
రాగమాలికలే!

నవ్యజీవన బృందావన
రంగులీనే  సీమలే!

అగాధ తమోమయమైన
జీవితాల వెలిగించు 

ఉదయానికి మదిపాడే
మోహనమైన

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు