రాజు వినయుడు దానశీలి.ఎవరినీ ఉట్టిచేతులతో పంపేవాడుకాదు.ఓముసలిరైతు షికారుకి వెళ్లినపుడు కన్పడ్తే"ఏంతాతా!ఎలాఉన్నావు?" అని ప్రశ్నించాడు. "వింతగా నవ్వుతూ అన్నాడు " మీసింహాసనం ఎక్కాలని పరిపాలించాలని ఉంది రాజా!" అంతే సభకు తెచ్చి తాతని గద్దెపై కూచోపెట్టి రాజు అడవిబాట పట్టాడు.అలసి చెట్టుకింద కూచుని ఉన్న రాజు తో ఆవృక్షం అంది"ఈపండుతిను.ఆకలి పోయి మంచి శక్తి వస్తుంది. " రాజు ఇలా ఆలోచించాడు"ఆముసలితాతకి శక్తి రావాలి.రాజ్యపాలన చేయాల్సినవాడు కదా!" అని గద్దెపై కూచున్న తాతతో"నీకు బలం శక్తి వస్తుంది.రాజ్యపాలన చేయాలికదా నీవు?" అని అంటే తాత అనుమానంగా చూసి పక్కనే ఉన్న భటుడికి ఇచ్చాడు.అదితింటూనే భటుడిలో వింత కాంతితేజస్సు చూసి "నాకు చెట్టు ని చూపు" అని తాత అడిగాడు. ఆచెట్టు నిండా అమరఫలాలు వేలాడుతున్నాయి.ఆచెట్టు అంది"రాజా!ఈతాత మోసగాడు ధూర్తుడు."అంటూ తాతపై కొమ్మలతో వాలిపోయింది చెట్టు.ఓవృద్ధుడు దివ్యతేజస్సుతో వెలిగిపోతూ "వినయా!నాస్వార్ధం వల్ల మునిశాపానికి గురైనాను.ఇంకో స్వార్ధం ఉన్న వాడిని చంపితే నాకు శాపవిముక్తి.అందుకే చెట్టుగా మారిననేను ఆతాతపై వాలి శాపవిమోచనం పొందాను.నీవు అపాత్ర దానం చేయరాదు" అని చెప్పి మాయమైనాడు.అర్హత లేని వారిని ఆదరించి పదవిలో కూచోపెట్టరాదు అని గ్రహించాడు వినయుడు 🌹
అమరఫలం! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి