నల్లగొండ కథాపాఠశాల ఆధ్వర్యంలో పిల్లలకు కథలు రాయడంలో మెళుకువల కోసం ' బాలల కథల బడి ' అనే కార్యక్రమం రోజంతా నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సమన్వయకర్తలు పెరుమాళ్ళ ఆనంద్, పొట్టబత్తుల రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 11 ఆదివారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వట్టిమర్తిలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణా కార్యక్రమం ఉంటుందని అన్నారు. ప్రారంభ సమావేశంలో ప్రముఖ యోగా గురువు, వందన పబ్లికేషన్స్ వ్యవస్థాపకులు మాదగాని శంకరయ్య విశిష్ట అతిథిగా పాల్గొంటారని, అనంతరం మొదటి పీరియడ్ లో 'కథలు ఎలా రాయాలి' అనే అంశంపై కథా రచయిత్రి ఉప్పల పద్మ బోధిస్తారని, అలాగే రెండో పీరియడ్ లో ' కథలో ఏ విషయాలు ఉండాలి ' అనే అంశంపై జర్నలిస్ట్, కథారచయిత పాటి మోహన్ రెడ్డి బోధిస్తారని, మూడవ పీరియడ్ లో 'కథలో భాష ఎలా ఉండాలి ' అనే అంశంపై పాఠ్య పుస్తక రచయిత సాగర్ల సత్తయ్య బోధకులుగా ఉంటారని వారు తెలిపారు. భోజన విరామం అనంతరం నాలుగో పిరియడ్ లో 'మచ్చుకు కొన్ని కథలు - పరిశీలన ' అనే అంశంపై సాహితీ విమర్శకులు, పరిశోధకులు డాక్టర్ మండల స్వామి బోధిస్తారని, ఐదవ పీరియడ్లో ' మనమూ కథలు రాసేద్దాం ' అనే అంశంలో పిల్లలతో కథలు రాయించనున్నట్లు పర్యవేక్షకులుగా పగిడిపాటి నరసింహ, దాసరి శ్రీరాములు వ్యవహరించనున్నట్లు సమన్వయకర్తలు తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమ కోర్సు డైరెక్టర్ గా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డోకూరి శ్రీనివాసరెడ్డి వ్యవహరించనున్నట్లు, ముగింపు కార్యక్రమంలో విశిష్ట అతిథిగా నాగార్జున ప్రభుత్వ కళాశాల
తెలుగు శాఖ అధ్యక్షులు డా. తండు కృష్ణ కౌండిన్య పాల్గొంటారని, ఆసక్తిగల ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని విద్యార్థులు పాల్గొనవచ్చని, మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
--- పెరుమాళ్ళ ఆనంద్
పొట్టబత్తుల రామకృష్ణ
9985389506
తెలుగు శాఖ అధ్యక్షులు డా. తండు కృష్ణ కౌండిన్య పాల్గొంటారని, ఆసక్తిగల ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని విద్యార్థులు పాల్గొనవచ్చని, మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
--- పెరుమాళ్ళ ఆనంద్
పొట్టబత్తుల రామకృష్ణ
9985389506

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి