టీచర్ డ్రాయింగ్ క్లాస్ లో పిల్లలని మీకు ఇష్టమైన దేవుని బొమ్మలు గీయండి అనడంతో నిశబ్దం గా పిల్లలు గీస్తున్నారు.కొందరు రంగులు పులుముతున్నారు.సాయి బాబా వెంకటేశ్వర స్వామి శివలింగం ఇలా తమ చిత్తం వచ్చిన ట్లు గీస్తున్నారు. అందరూ దాదాపు శివలింగం పెద్ద బొజ్జ వినాయకుడు గీశారు. అది తేలిక. కోతిబొమ్మ వేసి హనుమాన్ అని కొందరు రాశారు పెద్ద గదవేశారు."ఓ కృష్ణ కి ఏరంగు వేయాలి?గుడ్ నీలంకదూ?" టీచర్ వారిని ప్రశ్నలడుగుతున్నారు. ఆరోజు కొత్తగా చేరిన శివాకి ఏంవేయాలో తెలీలేదు. ఇంట్లో అంతా తలాఒక దేవుని పూజిస్తారు.చుట్టుపక్కలవారు వేరే మతస్థులు.అందుకే తన చిత్తం వచ్చినట్లుగా సున్నాలు చదరాలు గీశాడు.టీచర్ కి వాడుచెప్పిన జవాబు ఇది"మాఅమ్మమ్మ దేవునికి ఓరూపం రంగులేదు.మనం ఎలా ఊహిస్తే అలా కనపడతాడు.చిత్రకారులు కవులు తమ భక్తి ఊహలనుబట్టి చిత్రించారు. ఆశక్తిని మనసా తలుచుకుంటూ ఉండాలి " అని చెప్పింది.మనం చెడుపనులు చేయరాదని అపకారం తలపెట్టరాదని అందులోనే దేవుడున్నాడని అనుకుంటా." శివా మాటలకి టీచర్ ఆలోచన లో మునిగిపోయింది 🌹
పసిమనసు!అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి