దూరాన వెలిగే
మణిదీపం చూస్తూనే....
మనసుకు సత్తువొచ్చి
ఉరకలు వేస్తుంది.
చీకటి దయ్యం భయపడి
పారిపోతుంది.
ఓటమి కలిగినా
ఓర్పువహించే
ఆశనిస్తుంది.
వెక్కిరించే లోకాన్ని
నవ్వుతూ తప్పుకోమనే
ధైర్యం ఇస్తుంది.
ఎరుగని సమస్యలను
ఎలాగోలాఎదిరించే
బలమిస్తుంది.
నిరాశను తరిమేసే
గోరంత వెలుగును
చూపిస్తుంది.
కష్టం లేని విజయం లేదు
కళ్ళు తడవని జీవితం లేదు.
వాన చుక్కలా భువికి చేరినా
కడలి లోని నీటి బిందువువే!
బాధపెట్టే గాయాలే
కసిగా వేసే అడుగుకు
ఆసరా అవాలి.
కలవరపెట్టే కలతలే
కరిగి కాలప్రవాహంలో
కలిసిపోవాలి.
కాలగమనంలో
కమ్మని మరో ఉదయానికి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి