"ఇస్తే మనమూ దేవుడే!;-- యామిజాల జగదీశ్
 అమ్మా అయ్యా ధర్మం చేయండంటూ చెయ్యి చాచి అడుక్కునే వారితో "చేతులూ కాళ్ళూ బాగానే ఉన్నాయిగా...ఏదన్నా పని చేసుకుని బతుకొచ్చుగా. ఇలా అడుక్కో వడమేమిటీ?" అని చీదరించుకుంటాం. 
అయితే అలా చీదరించుకునే మనమే ఆలయానికి వెళ్ళి దేవుడి హుండీలో పదో ఇరవయ్యో యాభయ్యో వేసి "నాకు డబ్బివ్వు....ఇల్లివ్వు...అమ్మాయికి పెళ్ళయ్యేలా చూడు...పిల్లాడ్ని చదివించు...
అని రకరకాల కోరికలు కోరుతాం..." ఇవన్నీకూడా ఓ విధంగా చెప్పాలంటే అడుక్కోవడమే అవుతాయి.
మన దగ్గరకొచ్చి అడుక్కునేవారిని మనం ఏదన్నా పని చేసుకుని బతుకు ఈ ఆడుక్కోవడమేమిటీ అని మనం చెప్పినట్టే మనం ఆలయంలో కోరికలు కోరినప్పుడు ఆ దేవుడు కూడా మనతో చెప్తే ఏమవుతుంది? నీకు కాళ్ళూ చేతులూ ఉన్నాయిగా. కష్టించు. డబ్బులు సంపాదించుకో" అని చెప్తే దేవుడ్ని ఏమనగలం?!
లేనివారు లేదంటూ అడిగేటప్పుడు ఉన్నవారు ఇస్తే అతనూ లేనివారికి ఓ విధంగా దేవుడే అవుతాడు.
దేవుడ్ని ఎక్కడో వెతకకు. 
మనలోనే మంచి ఆలోచనతో మంచి మాటతో కరుణతో సాయంతో దేవుడ్ని సృష్టించుకోవచ్చు.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం