సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 అప్యయము... ఆప్యాయము
*******
ఆదిమత్వము నుండి ఆధునికత వైపు అడుగులు వేసిన మానవులం.శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుని అధునాతన సౌకర్యాలను అనుభవిస్తున్నాం.
ఎంతో మేథస్సుతో ప్రకృతిలోని గుట్టు మట్లను తెలుసుకుని ఇంతగా అభివృద్ధి చెందిన  మన జాతి ప్రకృతిని అప్యయం చేయడం చాలా బాధాకరం.
చెరువులను,తరువులను  కొండలు గుట్టలను ,నదీనదాలను, ఒకటేమిటి ఎన్నింటినో అప్యయం చేయడం వల్ల కాలుష్యంతో పాటు  కరోనా లాంటి వ్యాధుల బారిన పడి విలవిల లాడుతున్నాం.
ఇకనైనా  అప్యయం చేయడం లాంటి దుశ్చర్యలు మానేయాలి.
అప్యయము అంటే ఏమిటో చూద్దాం... అప్యయము అంటే నాశనము, అంతము, క్షయము, వినాశనము, ధ్వంసము,నిర్మూలనము, లయము, వమ్ము , సంహారము లాంటి అర్థాలు ఉన్నాయి.

ఆప్యాయము లేనంత కాలం మానవుడి ఆశ అత్యాశకు దారి తీస్తుంది.ఆ అత్యాశే అప్యయమునకు పూనుకుంటుంది.
 ఆప్యాయము ఉన్న చోట ఆనందం నీడలా వెంట ఉంటుంది.ఆప్యాయమును మించిన గొప్ప ఆస్తి మరొకటి లేదు.
ఆప్యాయము అంటే ఏమిటో చూద్దాం... తృప్తి, తనివి, ప్రసన్నము సౌఖ్యము సౌమనస్యము,సంతసము, సంతృప్తి అనే అర్థాలతో పాటు ప్రేమ,ఇంపు,ఎలమి, గారాబము అనే అర్థాలు కూడా ఉన్నాయి.
అప్యయము చేసే గుణాలను వదిలి వేయాలి. ఆప్యాయము అనే లక్షణాలను పెంచుకోవాలి.
శుభ సాయంత్ర నమస్సులతో🙏

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం