ధర్మో రక్షతి రక్షితః *@-- కోరాడ నరసింహా రావు
సూటిగా - స్పష్టంగా... 
  ధీటుగా -  ఘాటుగా.... 
    చెప్పాలంటే...., 
        ఎంతధైద్యం  కావాలి ?!
  ఎంతతెగువ - స్తైర్యం ఉండాలి 

మొహమాటాలు... 
   మెతకమాటలు... 
    నీళ్లు నమలాటాలు... 
     కప్పదాట్లు.....
    గోడ మీద పిల్లుల్లా
        ప్రవర్తించే కర్మా... !?
     అది కలలో మాట... !!

నిజాయితీని నచ్చనోళ్లు.... 
     వీడి పోతేనేం.... !
 వాళ్ళు స్నేహితులు, శ్రేయోభి లాషులు ఎలా కాగలుగుతారు !
  వాళ్లంతా విచ్చకాలు, మెచ్చు కోళ్లకు  వెంపర్లాడే వారు... !

   అలాంటి వాళ్లంతా... 
..   నిన్ను  వీడి పోతేనేం... !
   లోకమంతా ఏకమై... 
     నిన్ను వెలివేసినా...., 
నీఅంతరాత్మనిన్నుమెచ్చుకుంటే
    చాలునోయ్.... !! 
  ఆతృప్తి,ఆ ఆనందమే వేరోయ్

 కడివెడు  గాడిద  పాలకన్నా...
 గరిటెడు ఆవుపాలు మేలేకదూ 
   ఈ రోజు తిట్టిన వాళ్ళే.... 
      రేపు పొగుడుతారు !

 ఒక గజ దొంగానైనా క్షమించి... 
  క్రీస్తును అప్పుడునిర్దాక్షన్యంగ 
  శిలువవేసి,ఇప్పుడు దేవుడని 
      కొలవటం లేదూ.... !

ఆనాడు  సోక్రటీస్ కి... 
   విషమిచ్చి చంపి... 
     ఇప్పుడు గొప్పవ్యక్తిగా... 
   గుర్తించి,గౌరవించటం లేదూ!!
 సత్యానికెప్పుడూ... గుర్తింపు, గౌరవం ... సన్మానం- సత్కారం 
 నిదానంగానే... !  
     ఓపిక పట్టాలి... !!
 
 ఈ రోజు తెగడిన వాళ్ళే... 
    రేపు పొగుడుతారు !
వాళ్ళ పొగడ్తలు - తెగడ్తలు... 
    పరిగణలోకి తీసుకోకు..., 
 నీధర్మాన్ని నీవేనాడూ తప్పకు
 ధర్మో  రక్షతి  రక్షితః... !
     *******

కామెంట్‌లు