బాధ్యతలే తెలియని
బంగారంలాంటి రోజుల్లో
పాఠంచెప్తున్నా గుసగుసలే
ఓ రోజు రాకుంటే నిరాశపిట్ట
బడి చుట్టూ గిరికీలు..
పెద్దగా ప్రాణస్నేహంలేదు
కానీ..
ఇవాళ పొద్దుపడమరకి
వాలేముందు..
మనసు జ్ఞాపకాలచెలిమతవ్వి
తీయనిఊసులతో
దప్పిక తీర్చుకుందామనే ఆశ !
ఒకటి రెండు గుర్తుగా పేర్లున్నాయి..
మొహాలు లీలామాత్రమే
ఒక్కసారి.. వాళ్ళు పలకరిస్తే...
ఎంత బావుంటుంది !!
ఫలించని కలల్ని..
పరుచుకుంటున్న కలతల్ని..
ఒక్కసారి కలబోసుకుంటే..
ఎంత ఉపశాంతి !?
యూనిఫామ్ లోని
యూనిక్ తనం నేటికీ గుర్తు
యెన్ సి సి క్రమశిక్షణ
తనకివాళకూడా..
చుట్టూ ఉన్నవాళ్ళకి లేదు !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి