ప్రతీ జీవికి ఎంతో కొంత తెలివి ఉండక
తప్పదు,తెలివి లేని జీవి తెగువరి కాడు
మనసు లేని జీవికి మనుగడ కొరవగు
తెలివి,వివిధవిధాలు వివరించి చూడగా!
మంచి ఆలోచించు వాడు మనుగడ పెంచు
మానవుని మస్తిష్కం తెలివి తేటలకు
ఆలవాలం,మదింపు లేక ఆలోచించు వారు
ఆపదల పాలు తామే అద్వితీయులమని
తమని మించు వారు లేరని యోచించు
వారు అతి తెలివి పరులు, తెలివిగాఆలోచించట
ఒక బహుమానం,అది భగవంతుని వరప్రసాదం
అవమానించుటకు వాడు తెలవి నాశనకారి
అతిగర్వం ఉపయోగించు తెలివి నవ్వులు
పాలు,అవమానాలపాలు,
. అతి సర్వత్ర వర్జయేత్
తొందర పాటు వల్ల, ఈర్ష్య ద్వేషావల్ల
పుట్టుకొచ్చు,
తెలివిని సద్వినియోగ పరచ వచ్చు
అతితెలివి ఆపదలకు అవరోధాలకు
ఆలంబన.
కొప్పరపు తాయారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి