*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0216)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దేవతా సమూహ సహితమగా వచ్చిన శివునికి స్వాగత సత్కారాలు - నారదుని ద్వారా మేనకకు పెళ్ళి వారి పరిచయం - ఆమె శివుని, శిఔగణములను చూచి మూర్ఛ పోవుట *
*నారదా! తన సకల గణాలు, శివుని వివాహము చాడలనే ఉత్సుకతతో వచ్చిన భూత, ప్రేత, పిశాచాలు, ప్రమధ గణాలు, సకల దేవతా సమూహం తో కలసి హిమాచల పురమును చేరుకుని, నిన్ను, నారదుని, హిమాచలుని ఇంటికి పంపారు, శంభుడు. నీవు, గిరిరాజుకు శంబుని రాక గురించి చెప్పి, అక్కడ విశ్వకర్మ చేత తయారు చేయబడి, చైతన్యంతో వెలిగిపోతున్న వివిధ దేవమార్తులను చూచి ఆశ్చర్య చకితుడవు అయిన నీకు స్వాగత సత్కారాలు చేసి, పెళ్ళి వారిని తీసుకు రమ్మని, దేవర్షిని నీవెంట పంపాడు. మైనాకాది పర్వతములు కూడా స్వాగతం పలకడానికి వచ్చాయి. విష్ణువు మొదలగు దేవతలు అందరూ ఎంతో సంతోషం తో తమ వెంట రాగా, గణముల తోడుగా శివభగవానుడు హిమాలయ నగరము ప్రవేశించారు.*
*శివభగవానుడు పెళ్ళి కొడుకై సకల దేవతా సమూహమును వెంట బెట్టకుని తన నగరానికి చేరుకున్నారు అని తెకుసుకుని పరమానందంతో పొంగిపోయాడు,  హిమాచలుడు. తన ప్రాణప్రియుడగు స్వామి మీద ఉన్న భక్తి, ప్రేమలో గిరిరాజు మనసు ఓలలాడుతోంది. స్వామిని త్వరగా చూడాలనే ఉత్సుకత ఎక్కువ అవుతుండగా, మనో వేగంతో స్వామిని చేరుకున్నాడు, హిమవంతుడు. ఒకరిని ఒకరు కలుసుకున్న శివ గణములు, పర్వతాలు ధన్యలము అయ్యాము అని భావించారు. సకల పర్వతాలు, బ్రాహ్మణులతో కలసి గిరిరాజు, మహేశ్వరునికి నమస్కరించాడు. అప్పుడు ఆ స్వామి సుందర దివ్య రూపాన్ని తన మనసు పొరలలో పొందికగా దోచుకున్నాడు, శైలాధీశుడు.*
*వృషభారూఢుడైన శివభగవానుని ముఖము ఆనందముతో వెలిగి పోతోంది. సర్వాభరణ భూషితుడై ఉన్నారు. ఆ స్వామీ శ్రీ అంగములు అన్నీ పట్టువస్త్రములతో సుశోభితములై ఉన్నాయి. రత్నాలు, మణులతో పొదగబడిన కిరీటాన్ని ధరించిన శంభుడు పవిత్ర కాంతులను వెదజల్లుతూ ప్రకాశిస్తున్నాడు.  ఆ స్వామి అంగములు అన్నీ సర్ప భూషణములతో శోభిల్లుతున్నాయి. సరేశ్వర గణములు, శివ గణములు చామరములు వీస్తూ ఆ స్వామికి సేద తీరుస్తున్నాయి. ఆ స్వామి కి ఎడమ భాగమున, గరుడారూఢుడై, లక్ష్మీ సహితంగా విష్ణుమూర్తి ఉన్నారు. కుడిపక్కన, సరస్వతి తో బ్రహ్మ నైన నేను ఉన్నాను.ఇంద్రుడు మొదలైన దేవతలు శివభగవానుని వెనుక వైపు ఇరు ప్రక్కలా ఉన్నారు.  ఈ శివభగవానుడు సాక్షాత్తు పరమేశ్వరుడే. సమస్తమునకు ఈశ్వరుడు. ఉపాసకులకు మోక్షము ఇచ్చేవారు. ప్రాకృత గుణరహితుడు, భక్తాధీనుడు అయి కళ్యాణ గుణము లతో విలసిల్లు తున్నారు. ఈయన, ప్రకృతి పురుషులకంటే విలక్షణమైన సచ్చిదానంద స్వరూపుడు.*
*ఈ పరమ ప్రాకృత శివ రూపాన్ని చూచిన తరువాత, హిమాచలుడు తక్కిన దేవతా సమూహమును కూడా కన్నులారా చూసి అందరికీ నమస్కరించాడు. ఆ తరువాత శంభుని ఆదేశంను అనుసరించి, తాను ముందు నడుస్తూ, శివ భగవానుని, దేవగణ సహితంగా తన నగరం వైపుకు తీసుకు వెళుతున్నాడు, గిరిరాజు. మందిరం లో ఉన్న మేనక తన కూతురిని వివాహం చేసుకోవడానికి వస్తున్న మహాదేవుని ముందుగా తాను చూడాలి అని ఉత్సుకతతో ఉంది. నారదా! మేనక నిన్న తలచుకుని, తన కోరిక తీర్చమని అడిగింది. శివ భగవానుని ఆనతి మీద నీవు మేనక వద్దకు వెళ్లగా, నిన్ను చూచి, "మునీంద్రా! నా కుమార్తె ఎంతో ఘోరమైన, దివ్యమైన తపస్సు చేసి, శివుని మెప్పించి, ఆయన వర ప్రభావంతో ఇప్పుడు సదాశువుని వివాహం చేసుకోబోతోంది. ఆయన ఎంతో మహానుభావుడు, సౌదర్యరాశి అయి ఉండవచ్చు. వారిని ముందుగా నేను చూడాలనుకుంటున్నాను. ముందుగా నాకు ఆయన దర్శన భాగ్యం కలిగించండి" అని ప్రార్థన చేసింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం