*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0219)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
శంభుని రూపం చూచి మేనక విలపించుట - కుమార్తె వివాహం ఆతనితో జరుగ రాదని పట్టు పట్టటం - శ్రీవిష్ణువు, దేవతలు నచ్చ చెప్పడం - సుందర రూపములో ఉన్న శివునికి మాత్రమే తన కాళిని ఇచ్చి వివాహం జరిపిస్తాను అని చెప్పడం.
*నారదా! పార్వతి వివాహం శంభునితో జరపను అని పట్టు పట్టిన మేనక దగ్గరకు వచ్చిన నన్ను చూచి నీవు మేనకతో "అమ్మా నీవు ఎంతో పతివ్రతవు. నిజానికి శివుని రూపము చాలా సుందరముగా ఉంటుంది. తన లీల చూపించడానికి ఈ రూపంలో నీ ముందుకు వచ్చారు, శంకరుడు. నీవు బాధపడకుండా నీ కుమార్తె ను వృషభవాహనునకు ఇచ్చి వివాహం జరుపించు" అని చెప్పగా, మేనక నిన్ను చూచి "చాలు. మా నుండి దూరంగా వెళ్ళు. నేను ఈ వివాహం జరగనివ్వను" అంది మేనక. అప్పుడు ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు ఆమె వద్దకు వచ్చి, "మేనకా! ఈ శివుడు అందరి కంటే గొప్పవాడు. అందరికీ ఆరాధ్యదైవం. ఉత్తమమైన సుఖమును ఇస్తాడు. నీ కుమార్తె చేసిన అత్యంత దుస్సహమైన తపస్సుకు మెచ్చి ఈ స్వామి కాళిని వివాహం చేసుకుంటాను అని వరము ఇచ్చారు." అని చెప్పగా, "శివుని రూపము అత్యంత భయంకరముగా ఉంది. నా కుమార్తె అతిలోక సుందరి. మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు. పార్వతిని ఈ కురూపికి ఇవ్వను గాక ఇవ్వను." అని పలికింది, మేనక. వశిష్టాది సప్తర్షులు కూడా మేనక మనసును మార్చలేక పోయారు. అప్పుడు హిమాచలుడు అక్కడికి వచ్చాడు. ఈశ్వర తత్వమును చెప్పే ప్రయత్నం చేసాడు.*
*"ప్రియమైన మేనక! శివుడే సర్వాంతర్యామి. ఆతడే సకల జగత్తుకు కర్త, భర్త, హర్త. నీ ఇంటికి దేవతా సమూహము మొత్తం వచ్చింది. సప్తర్షులు, దిక్పాలకులు, సనకసనందనాది మునులు కూడా వచ్చారు. వీరందరూ మన ఇంటికి రావడం మన పుణ్య ఫలం. నానా రూపములు గల శివుడు ఇంతకు మునుపు నాట్యకారుడుగా, భిక్షకుడుగా వచ్చారు. తరువాత, స్వామిని తెలుసుకుని పూజ చేసి మన కుమార్తె ను వారికి ఇచ్చి వివాహం చేస్తాము అని మాట ఇచ్చాము. ఇప్పుడు, శంభుడు నీకు తన ఇంకొక లీలా రూపము చూపించారు. కానీ, ఈశానుడు ఎప్పుడూ సర్వాంగ సుందరేశుడే. సర్వాభరణ భూషితుడే. ప్రియే! స్వామి మహాత్మ్యమును అర్థం చేసుకుని మనము ఇచ్చిన మాట నెరవేర్చడానికి నీవు కూడా సంసిద్ధురాలు అవు. మన మాటను సార్ధకము చేయి." అని చెప్పగా, "మహారాజా! మీరు మన కుమార్తెను, కొండపై నుండి తోసివేయండి, విష సర్పాలతో కరపించండి, లేదా సముద్రంలో పడవేయించండి. కానీ, శంభునితో వివాహం జరిపించకండి" అని తన హఠాన్ని తెలియజేసింది మేనక.*
*వింతగా ప్రవర్తిస్తున్న తల్లిని చూచి మేనక, ఆమె దగ్గరకు వెళ్ళి తన మాట ఇలా చెప్పింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం