బ్రహ్మ, నారద సంవాదంలో.....
వరుడుగా శివునకు మంగళహారతి ఇవ్వడం - కన్యాదాన సమయానికి హిమాచలుని ఇంటికి వెళ్ళడం - వధూవరులు ఒకరినొకరు పూజించుకోవడం.
*నారదా! గిరి శ్రేష్టుడు అయిన హిమాచలుడు, మహాదేవునికి, మిగిలిన దేవతా సమూహమునకు అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి ఇంటిలోనికి రమ్మని ప్రార్ధించాడు. ఆతని మాటను మన్నించి, విష్ణువు మొదలగు దేవతలు, మునులు అందరూ కూడా సంబరాల మధ్య ఇంటిలోనికి వెళ్లారు. ఇంట్లో ముత్తైదువులు గిరిరాజ పుత్రి పార్వతి ని లోకాచారము అనుసరించి శివుడు ఇచ్చిన ఆభరణాలతో అలంకరించారు. తరువాత, బ్రాహ్మణ పత్నులు, మేనక కలిసి పార్వతి కి మంగళాస్నానాలు చేయించి, హారతులు పట్టారు. ముల్లోకాలకు తల్లి, మహాశైల పుత్రి, సర్వమంగళ అయిన గిరిజా దేవి దివ్య వస్ర ఆభరణాల తో ఆభూషితురాలే ఉచితమైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది.*
*హిమాచలుని ఇంట వధూవరుల పక్షములలో గొప్ప ఉత్సవాలు జరుగుతున్నాయి. బ్రాహ్మణులకు ఉచిత దానాలు ఇస్తున్నారు. గీతవాద్యములు మంగళకరముగా మ్రోగుతున్నాయి. ఈ కోలాహలం అంతా చూస్తూ బ్రహ్మ నైన నేను, విష్ణువు, ఇంద్రాది దేవతలు, కూడా ఆ ఉత్సవాలలో పాలు పంచుకున్నాము. జగజ్జనని అయిన పార్వతికి భక్తితో నమస్కరించాము.*
*ఇంతలో పురోహితులు గర్గ మహర్షి కన్యాదాన సమయం ఆసన్నమైంది అని చెప్పగా, హిమాచలుడు వరుడైన శంకరుని, పరివారాన్ని తీసుకు రావడానికి మంత్రులు, తన కుమారలతో వెళ్ళి వివాహానికి తరలి రావలసిందిగా కోరి నమస్కరించారు. భగవంతుడు అయిన శివుడు దివ్యాభరణాలను ధరించి, వృషభారూఢుడై, విష్ణువు, నేను, ఇంద్రుడు మొదలైన పరివారం ముందు నడుస్తూ ఉండగా, శివ పార్షదులు మేళతాళాలతో ఉత్సవము గా మా ముందు భాగంలో ఉండగా పెండ్లివారందరూ హిమాచలుని భవంతికి బయలుదేరారు. పరమేశ్వరుడు అయిన శివుడు పరమేశ్వర ఉచితమైన శోభతో తేజస్సుతో యాత్ర చేస్తున్నారు. ఆయనకు, పెద్ద గొడుగు పట్టారు. అన్ని ప్రక్కల నుండి చామరములు వీస్తున్నారు. గుడారముల క్రింద నుండి ప్రయాణమౌతున్నారు పరమశివుడు. ఇలాంటి సమయంలో దేవదేవుని సేవలో ఉన్న దేవోత్తములు అందరూ ఆ స్వామి మీద పుష్ప వృష్టి కురిపిస్తున్నారు. ఈవిధంగా సంరంభంగా కళ్యాణ మండప ప్రాంగణంలో ఉన్న యజ్ఞ కుండం దగ్గరకు వచ్చిన మహాశివుని వృషభవాహనము నుండి క్రిందకు దించారు పర్వతశ్రేష్టులు.*
*తరలి వచ్చిన శివభగవానునికి, ఇతరులకు అర్ఘ్య పాద్యాదులు ఇచ్చిన తరువాత, పుణ్య స్త్రీలు మంగళహారతులు పట్టారు. పురోహితుడు మధుపర్క సమర్పణ మొదలు ఉత్తమ కార్యములు అన్నీ కూడా చేయిస్తున్నారు. తరువాత, హిమాచలుడు, సర్వాభరణ భూషిత అయిన ఉమను వేదిక మీదకు తీసుకు వచ్చారు. గర్గ మహాముని చెప్పగా, నేనును, విష్ణువు, ఇంద్రుడు కలిసి శివుని వేదిక మీదకు తోడ్కొని వెళ్ళాము. గర్గ మాహాముని పుణ్యాహవచనం పూర్తి చేసాడు. పార్వతి దోసిలిలో బియ్యం నింపి శివుని మీద ఆక్షతలు వదిలి పెట్టారు. పెరుగు, అక్షతలు, కుశలతో పార్వతీ దేవి, రుద్రదేవుని పూజించింది. తరువాత నేను, గర్గాది మునులు చెప్పగా శివుడు కూడా మిగుల ప్రేమతో లోకాచారమును అనుసరించి పార్వతిని పూజించారు. ఇలా శివాశివుల పరస్పర పూజలు అయ్యాక పుణ్యాంగనలు హారతులు ఇచ్చారు. అందరూ కూడా కన్యాదానోచితమైన శుభ సమయం కోసం వేచి ఉన్నారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి