*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0225)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
పూర్తయిన శివాశివుల వివాహ సంరంభం - వధూవరులు నివాస భవనానికి వెళ్ళడం - రతీ దేవి ప్రార్థన - కామదేవునకు జీవన దానం - వధూవరులు మృష్టాన్నమును తినిపించుకొనడం - శివుడు జనావాసములకు తిరిగి వెళ్ళడం.
*నారదా! నామాట మన్నించి మహేశ్వరుడు బ్రాహ్మణుల ద్వారా అగ్ని ప్రతిష్టాపన చేసారు. తరువాత, పార్వతీదేవి శివుని ఎదురుగా కూర్చోగా ఋగ్, యజుర్, సామ వేదమంత్రములను చెపుతూ అగ్నికి ఆహుతులు ఇచ్చారు. అప్పుడు, కాళీ సోదరుడు మైనాకుడు లావాయొక్క అంజలి ఇచ్చెను. ( మన లౌకిక వివాహం లో జరిగే లాజ హోమం). శివాశివులు ఇద్దరూ, అగ్ని దేవునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసారు.*
*నారదా! తరువాత, నేను శివాశివుల వివాహ తంతు సంపూర్ణంగా చేయించాను. సకల జీవులకు ఆదిదంపతులు అయిన వారిద్దరికీ అభిషేకాలు చేసారు, ఋషులు, మునులు, బ్రాహ్మణులు. ఆపిదప, ధృవుని దర్శనం చేయించారు, ఆ పుణ్య దంపతులకు. హృదయాలంబనము పూర్తి అయ్యాక స్వస్తి వచానాలు చెప్పారు, పురోహితులు. లౌకిక ఆచారము అనుసరించి, పురోహితుల ఆజ్ఞ మేరకు, శివా నుదుటి పైన సిందూరము ఉంచారు శివుడు. అప్పుడు, మహారాజ్ఞి, జగదేకమాత అయిన ఉమ శోభ ఎంతో అద్భుతముగా వర్ణనాతీతం గా ఉంది.*
*ఆ తరువాత వధూవరులు ఇద్దరూ ఒకే సింహాసనము లో కూర్చున్నారు. చూచే వారి కన్నులు, మనసులు ఆనందంతో అంబరాన్ని తాకుతున్నాయి. తరువాత, అద్భుతమైన లీలు చేసే ఆ నవదంపతులు, నా ఆదేశము పొంది స్వస్థలమునకు వచ్చి "సంస్రవ ప్రాశనము" చేసారు. {అగ్ని కి ఆహుతులు ఇవ్వడానికి శ్రుస్రువాలను వాడతారు. అగ్ని లో నెయ్యి ఆహుతి ఇచ్చాక, స్రువములో మిగిలిన నెయ్యిని, ప్రోక్షణము చేసి, వేరొక పాత్ర (ప్రోక్షణీ పాత్ర)లో ఉంచుతారు. ఆహుతి ఇచ్చిన ప్రతీసారి ఈ విధంగా చేస్తారు. ప్రోక్షణీ పాత్రలో వేసిన నెయ్యి ని "సంస్రవ" అంటారు. ఆహుతులు ఇవ్వడం పూర్తి అయిన తరువాత, యజమాని ప్రోక్షణీ పాత్రలో ఉన్న నెయ్యిని తాగుతారు. ఈ పద్ధతిని "సంస్రవ ప్రాశనము" అంటారు}.*
*ఈ విధంగా శివాశివుల వైవాహిక యజ్ణము పూర్తి అయ్యింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం