*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0226)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
పూర్తయిన శివాశివుల వివాహ సంరంభం - వధూవరులు నివాస భవనానికి వెళ్ళడం - రతీ దేవి ప్రార్థన - కామదేవునకు జీవన దానం - వధూవరులు మృష్టాన్నమును తినిపించుకొనడం - శివుడు జనావాసములకు తిరిగి వెళ్ళడం.
*నారదా! శివాతో తన వివాహ తంతు ముగిసిన తరువాత, శంభుడు బ్రహ్మ నైన నాకు పూర్ణపాత్రను, ఆచార్యలకు గోవులను, బ్రాహ్మణులు, సకల దేవతలకు ఉచితములైన దానములు చేసారు. అనంద కోలాహలంతో అన్ని ప్రక్కల నుండి జయజయ ధ్వానాలు చేసారు, శంభుని పరివారం. విష్ణువు, నేను మిగిలిన దేవతలు, నీతో సహా గిరిరాజు అనుమతి పొంది మనకు ఇవ్వబడిన విడిది గృహాలకు వెళ్ళాము.*
*తరువాత, హిమాలయ నగరం లోని పుణ్య స్త్రీలు శివపార్వతులను గదిలోకి తీసుకు వెళ్ళి, లోకాచార విధులు పూర్తి చేసారు. ఆ తరువాత వారు ఆ నవ దంపతులను ఎంతో అందంగా అలంకరించబడిన దివ్య భవనము లోకి తీసుకు వెళ్లారు. పరిచారికలు వచ్చి దంపతులను తమ ఆచార పద్ధతిలో అలంకరించి, కేళీ గృహానికి తీసుకువెళ్ళారు. మంగళ కరమైన జయ జయ ధ్వానాలు చేస్తూ "బ్రహ్మ ముడి" విప్పడం మొదలగు పనులు చేసారు. ఆ నూతన దంపతుల మీద గౌరవముతో, చూసి ఆనందాన్ని పొందడానికి, సరస్వతి, లక్ష్మీ, సావిత్రి, గంగ, అదితి, శచి, లోపాముద్ర, అరుంధతి, అహల్య, తులసి, స్వాహా, రోహిణి, పృథివి, శతరూప, సంజ్ఞ, రతి అనబడే పదహారు మంది దివ్య స్త్రీలు, అనేక మంది నాగ కన్యలు, దేవ, ముని కన్యలు వచ్చారు. వీరందరూ, శివభగవానుని కి ఇచ్చిన రత్న మణిమయ సింహాసనము మీద ప్రసన్నుడై కూర్చున్నారు, పార్వతీ సహితంగా. పదహారు మంది దివ్య స్త్రీల తో సంభాషణములు చేసి, మృష్టాన్నభోజనము చేసి, ఆచమనము చేసి తాంబూలము వేసుకున్నారు, పార్వతి చిలకలు చుట్టి అందిస్తుండగా.*
*అతి ప్రసన్నంగా ఉన్న శంభుని చూచి, రతీదేవి, ఈ సమయము తనకు అనుకూలముగా ఉంది అనుకొని, "శంకరా! భక్తవత్సలా! మీరు పార్వతిని తిరిగి పొంది సౌభాగ్యవంతులు అయ్యారు. మీరు ఇద్దరు ఒకటిగా అవ్వాలి అని ప్రయత్నం చేసిన నా భర్త, మన్మధుడు, మీ ఆగ్రహానికి గురి అయ్యి, విగతజీవుడుగా ఉన్నారు. ఉమ దూరమైనప్పుడు మీరు ఎంత బాధ అనుభవించారో, ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. మీ వివాహము జరగడం వల్ల అందరూ ఆనందాబుధిలో ఓలలాడుతున్నారు. కేవలం, నేను తప్ప. అందువల్ల, దయాసాగరా! నా మొర విని, దయచేసి నా భర్తను పునరుజ్జీవితుణ్ణి చేయండి. దీనబంధూ! పరమప్రభూ! మీరు తప్ప నాకు దిక్కెవ్వరూ లేరు. నా దుఃఖబాధను తొలగించ గలిగిన వారు మీరు ఒక్కరే. ఈ ఆనంద సమయంలో నాకు కూడా ఆనందాన్ని ప్రసాదించండి. నా భర్తను బ్రతికించి, మీ భక్త పరాధీనత మరొక్కమారు నిజం చేసుకోండి." అని చెప్పి కామదేవుని శరీర భస్మమును శివునికి ఇచ్చింది, రతీదేవి. రతి బాధను చూసి మిగిలిన దేవతా స్త్రీలు కూడా అత్యంత బాధను అనుభవిస్తూ, రతి ప్రార్థన మన్నించి కామదేవుని బ్రతికించమని వేడుకున్నారు.*
*వీరందరి ప్రార్థన విన్న శంభుడు తన చేతిలో ఉన్న మన్మధుని భస్మము వైపు కృపాదృష్టితో చూడగానే, కాముడు తన పూర్వ రూపాన్ని పొందాడు. సజీవుడైన తన భర్తతో కలసి శుభంకరుడైన శంకరునికి నతమస్తకులై నమస్కారం చేసారు, రతీమన్మధులు. అప్పుడు, భక్తవత్సలుడైన ఈశానుడు, వారిని వరం కోరుకోమన్నారు. "స్వజనుల యందు ప్రేమను, నీ పద భక్తి" ప్రసాదించమని అడిగాడు, మన్మధుడు. మన్మధుడు కోరిన వరం ఇచ్చిన వృషభవాహనుడు, "ఈ రోజు నుండి నీవు బాహ్యముగా తిరుగ గలవు. నీవు విష్ణుమూర్తి ని చేరి అక్కడే ఉండు" అని చెప్పారు.*
*బాహ్య ప్రపంచంలో కి వచ్చిన మన్మధుడు, విష్ణువు మొదలగు దేవతలు అందరికీ నమస్కరించి, కీర్తించాడు. వారందరూ రతీమన్మధులను ఆశీర్వదించారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం