కందం:
*విను లోకంబున ధర్మం*
*బనఁగ గులాచారమట్ల నరసి నడువఁదా*
*గను మూయుః కీర్తుల నిహ*
*మునఁ బరమునఁ బొందు సౌఖ్యములను గుమారా !*
తా:
కుమారా! ఈ లోకములో వంశాచారములను తెలుసుకుని ఆచరించడమే, ధర్మ మార్గంలో నడవడం. అలా వంశాచారములు తెలుసుకుని పాటించిన వారికి ఈ భూమి మీద కీర్తి, పరలోకములో సుఖ సంతోషాలు కలుగుతాయి అని తెలుసుకో....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*మన పూర్వీకులు, తల్లిదండ్రులు ఆచరించి చూపించిన మంచి దారిలో మన నడత ఉండేటట్లు చూచుకోవడమే, ప్రస్తుత మన ధర్మం. మను ధర్మం కూడా. వారు అందరూ పాటించిన శుచి, శుభ్రత, మనం పాటిస్తే, ఇప్పుడు కోవిడ్ మనజోలికి వచ్చేది కాదు. అలాగే, వారు ఆచరించి చూపించిన పరోపకార బుద్ధి, ఎదుటి వారిని నిందించకుండా, బాధించకుండా, పక్కవారి ఎదుగుదలకు ఈర్ష్య, ద్వేషాలు పెంచుకోకుండా ఉండడం మనం కూడా చేస్తే, ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్న ఎన్నో దారుణాలు జరిగేవి కాదు. అందువల్ల, మనం, మన వంశాచారం ప్రకారం, పెద్దలు చూపిన దారిలో నడచే స్థిరమైన మానసిక స్థితిని మనకు ఇమ్మని ...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి