*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 035*
 కందం:
*ఒరులెవ్వరేని దనతో*
*బరిభాషించినను మేలు పలుక వలయునా*
*దరము గల చోట ఁగీడు*
*కరము నొనర్పంగరాదు గదర కుమారా !*
తా:
కుమారా! ఇతరులు ఎవరైనా నీతో మాట్లాడినప్పుడు నీవు మంచి మాటలను చక్కగా మాట్లాడాలి. మనల్ని ఆదరము, ప్రేమతో చూసే వారికి చెడు జరిగే పనులు చేయకూడదు....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*అవతలి వారికి ఎవరికైనా చెడు చేయాలి అని ఆలోచించడం చాలా తప్పు అని పెద్దల మాట. అంతే కాదు, ఎదుటి వారికి మనం ఏమిస్తే, మనకు అదే వెనక్కి వస్తుంది అనేది కూడా ప్రాచుర్యంలో ఉన్న మాట. పాండవులను సర్వనాశనం చేయాలి అని అనుకున్న దృతరాష్ట్ర కుమారులు వారే సర్వనాశనం అయ్యారు కానీ, పాండవులకు ఏమీ నష్టం కలుగలేదు. అలాగే, సుగ్రీవుని రాజ్యం మొత్తం తానే పొందాలి అనుకున్న వాలి పరమేశ్వరునికి ప్రీతి పాత్రుడు అయ్యాడు. కనుక, నలుగురితో మంచిగా ఉంటూ, మంచిని పెంచుతూ, నొప్పింపక తా నొవ్వక అందరితో కలసి మెలసి ఉండే మంచి మనసును మనకు ఇమ్మని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు