కందం:
*సిరి చేర్చు బంధువుల నా*
*సిరియే శుభముల నొసంగు చెలువుల గూర్చున్*
*సిరియే గుణవంతుండని*
*ధరలోఁ బొగడించునంచు దలపు కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద మన దగ్గర ఉన్న డబ్బులు బంధువులను మన దగ్గరకు తీసుకువస్తాయి. సంపద అన్ని కోరికలను తీరుస్తుంది. స్నేహితులను ఇస్తుంది. మనలను మంచి గుణము కలవారము అని కూడా లోకం చేత పొగిడింప చేస్తుంది అని తెలుసుకో....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"ధనమూలమ్ ఇదం జగత్" అని లోకంలో నానుడి. అంటే, మన సమాజంలో చాలా మంది, మన గుణ గణాలకన్నా మన దగ్గర ఉన్న సందలు, ధనము, భవంతుల వంటి లౌకిక విషయాలకే ప్రాధాన్యత ఇస్తారు. మన బ్రతుకు, కుటుంబం గడవాడనికి అవసరమైన సంపద ప్రతి వ్యక్తి సంపాదించాలి. అది ఆ వ్యక్తి మౌలికమైన ధర్మం. కానీ, ఎవరికైనా, ఎప్పటికైనా డబ్బు సంపాదించడం మాత్రమే జీవితం కాకూడదు. ఎందుకంటే, డబ్బు, సంపదలు ఎప్పటికీ శాస్వతం కాదు. మనకు దక్కిన రూపాయిలో కనీసం పది పైసల వంతైనా అవసరమైన వారికోసం ఖర్చు చేయాలి అనే ఆలోచన రావడం/తెచ్చుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మనకందరకు, పరమాత్మా, నీవు నాకు అవసరమైన అంత సంపద ఇవ్వు. అలాగే, నీవు ఇచ్చిన దాంట్లో పదోవంతైనా ఎదుటి వారి కోసం ఖర్చు చేసే గుణం ఇవ్వు అని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి